మాండూస్ తుఫాన్ తీరం దాటింది.. విలయం సృష్టిస్తోంది.. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటిందని ఐఎండీ ప్రకటించింది… సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇది కోస్తా తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. మహాబలిపురంకు వాయవ్యంగా 70కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర తమిళనాడుపై కొనసాగుతూ మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. తీరం వెంబడి 55కి.మీ గరిష్ట వేగంతో గాలులు…
తీరం దాటిన మాండూస్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. ఇక, తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం, ఆదివారం రెండు రోజులు గ్రామాల్లో పర్యటించాలని ఆదేశించారు. వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు…
మాండూస్ తుఫాన్ తీరం దాటింది.. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటిందని ఐఎండీ ప్రకటించింది… సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇది కోస్తా తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు నిండడంతో.. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి… బాధితులకు అండగా ఉండేందుకు ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది.. బదిలీలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. రెండు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ, చివరికి టీచర్ల బదిలీలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. దీనిపై ఈనెల 12వ తేదీలోపు ప్రకటన విడుదల చేసి, నెల రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు… ఆన్లైన్లోనే ప్రక్రియ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8ఏళ్లు ఒకేచోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి…
* నేడు భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడో వన్డే.. ఇప్పటికే 2-0తో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న బంగ్లాదేశ్, ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ * నిర్మల్ జిల్లా: నేడు బాసర ట్రిపుల్ ఐటీకి మంత్రి కేటీఆర్.. ఆర్జీయూకేటీలో నేడు 5వ స్నాతకోత్సవ వేడుకలు, హాజరుకానున్న ముగ్గురు మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి * మహాబలిపురం వద్ద తీరందాటిన మాండూస్ తుఫాన్.. తమిళనాడులో కుండపోత వర్షాలు, చెన్నై, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు,…
Jogi Ramesh: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఈ వాహనానికి వారాహి అని నామకరణం చేశారు. అయితే వారాహి రంగుపై విమర్శలు చెలరేగాయి. పవన్ తయారుచేయించుకున్న బస్సు మిలిటరీ వాహనం తరహాలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉండడం పట్ల వైసీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రైవేటు వాహనాలకు మిలిటరీ వాహనాల రంగు వేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్…
Congress Party: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. గత 9 ఏళ్లుగా ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాదాపుగా సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీకి కొత్త చీఫ్ను అధిష్టానం నియమించింది. తాజాగా ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా శైలజానాథ్ నుంచి గిడుగు రుద్రరాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రుద్రరాజును కలిసి అమరావతి రైతులు అభినందనలు తెలిపారు.…
Pawan Kalyan: జనసేనకు చెందిన వారాహి వాహనంపై వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతల ఆరోపణలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల రూపంలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు కారు టు కట్డ్రాయర్ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతల లంచాలు, వేధింపుల…
Andhra Pradesh: ఏపీలో మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పలు జిల్లాలలో అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లాలో మాండూస్ తుఫాన్ కారణంగా ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గిరీషా సూచించారు. జిల్లాలో సైక్లోన్ కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని.. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సమస్యలపై కంట్రోల్ రూం నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్:…