Fire Accident: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది.. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.. పరవాడ ఫార్మాసిటీలోని లారస్ యూనిట్ -3లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. లారస్ ఫార్మా లో జరిగిన ప్రమాదంలో ఐదు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పి.. బాధితులను ఆస్పత్రికి తరలించారు.. కిమ్స్ ఐకాన్ లో సతీష్ అనే కార్మికుడికి చికిత్స పొందుతుండగా.. మిగతా నలుగురిని కేజీహెచ్‌కు తరలించారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఖమ్మం జిల్లాకు చెందిన బి.రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన రాజేష్ బాబు, కే.కోటపాడుకు చెందిన ఆర్. రామకృష్ణ, చోడవరానికి చెందిన మజ్జి వెంకటరావు మృతిచెందారు.. ఇక, మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాకు ప్లాష్ ఫైర్ డ్రయర్ రూంలో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.. రియాక్టర్ కింద నుంచి ఫైర్ అవ్వడంతో ప్రమాదం సంభవించింది..
Read Also: Tiger Attack: అసోంలో జనాలపై విరుచుకుపడ్డ చిరుత.. దాడిలో 13మందికి గాయాలు
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో నీ లారస్ ల్యాబ్ లో మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించిన దశలో ఐదుగురు కార్మికులు ఒకే చాంబర్లో ఉండడంతో ఒక్కసారిగా మంటలకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే షీలా నగర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజేష్.. రాంబాబు.. రామకృష్ణ వెంకట్రావు చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందారు. మరో కార్మికుడు సతీష్ అత్యవసర వైద్యం పొందుతున్నట్టు తెలుస్తుంది. కంపెనీలోని షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు కొందరు చెబుతుంటే మరికొందరు రసాయనాలు లీకు కారణంగా ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.