TTD: భక్తులకు టీటీడీ ఈవో కీలక సూచనలు.. అలా అయితేనే తిరుమలకు రావాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. తిరుమలలో సర్వదర్శనం క్యూ లైనలను పరిశీలంచిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.. ఇక, సర్వదర్శనం భక్తులకు జనవరి 1వ తేదీన తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ద్వారా టోకేన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.. సర్వదర్శనం భక్తులు టోకెన్ పొందిన తర్వాతే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు రావాలని.. వారికి కేటాయించిన సమయానికి కృష్ణతేజా అతిధి గృహం వద్ద క్యూ లైనులోకి చేరుకోవాలని సూచించారు.. అంటే టోకెన్ పొందిన వారే తిరుమలకు రావాలని స్పష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.
Read Also: GVL Narasimha Rao: జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు.. కాపులు ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇక దిగరు..!
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని చెప్పిన ఈవో.. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా రూ.300 ఎస్‌ఈడీ టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్ ఎదురుగా గల విష్ణునివాసం, రైల్వేస్టేషన్ వెనుక గల 2, 3 సత్రాలు, ఆర్‌టీసీ బస్టాండు ఎదురుగా గల శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్ పల్లి జెడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని.. భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తిరుమలకు ప్రయాణం పెట్టుకుంటే మంచిదని సూచించారు. ఇక, భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా.. టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని కోరారు. ఇక, జనవరి 4 నుండి జనవరి 11, 2023 వరకు తిరుమల వసతి కోటా బుకింగ్ కోసం అందుబాటులో ఉండనుంది.. వైకుంఠ ఏకాదశి దృష్ట్యా 2023 జనవరి 1, 2 మరియు 3 తేదీల్లో ఆన్‌లైన్ వసతి కోటా అందుబాటులో ఉండదని చెబుతున్నారు అధికారులు.
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!