Chandra Babu: గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముస్లిం మైనారిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రి పదవులు పొందాలంటే 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదని, ప్రభుత్వ సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదని.. దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే దుల్హన్ పథకాన్ని తీసుకువస్తానని..…
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేయాలని టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రాకుండా చంద్రబాబు తొక్కేస్తున్నాడని కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ డీఎన్ఏ అయిన జూనియర్ ఎన్టీఆర్‌ను కాదని నారా లోకేష్‌ను అందలెక్కించడం ద్వారా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని కొడాలి నాని పరోక్షంగా ఆరోపించారు. అలాగే ఏపీని ఆక్రమించాలని ఓ కులం పన్నాగాలు…
గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కొంతకాలం.. రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించినా.. ఆ తర్వాత దూరం అయ్యారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.. విశాఖ నుంచే మరోసారి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆయన మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందని…
* నేటి నుంచి ఫిఫా వరల్డ్‌కప్ క్వార్టర్ ఫైనల్స్.. రాత్రి 8.30 గంటలకు బ్రెజిల్‌తో క్రొయేషియా ఢీ, రాత్రి 12.30కి అర్జెంటీనాతో నెదర్లాండ్స్ మ్యాచ్ * బలహీనపడుతున్న మాండూస్ తుఫాన్.. నేటి అర్ధరాత్రికి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరందాటే అవకాశం * శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. శబరిమలకు లక్షలాదిగా చేరుకున్న భక్తులు, నిన్న రాత్రి నుంచి పూర్తిగా నిండిపోయిన కంపార్ట్మెంట్లు, అయ్యప్ప భక్తులతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ * నేడు మధ్యాహ్నం 1.20కి…
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తుఫాను రోజురోజుకూ మరింత బలంగా దూసుకొస్తోంది. దీనిపై వాతావరణ అధికారులు వేస్తున్న అంచనాలు మాటిమాటికీ మారిపోతున్నాయి. నిన్న తీరం దాటుతుందని అంచనా వేయగా.. తాజాగా ఈ లెక్క మారింది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకి దగ్గరలో ఉన్న ఈ తుఫాను.. శనివారం ఉదయం శ్రీహరికోట - పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. నేను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.. అయితే, నియోజకవర్గ అభివృద్దికి ఎక్కువ నిధులు తీసుకువచ్చిన వ్యక్తిని నేనే అన్నారు కోమటిరెడ్డి… రాబోవు ఏడాదిన్నర కాలం నియోజకవర్గ అభివృద్ది పైనే దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. కాంగ్రెస్‌లో కొనసాగుతారా? మరోపార్టీలో…