మాండూస్ తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలి తీవ్రత పెరుగుతోందని వెల్లడించింది.
YSRCP: ఇటీవల ఏపీలోని అధికార పార్టీ వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ ట్విట్టర్ ఖాతాలో క్రిప్టో కరెన్సీకి చెందిన వార్తలను పోస్ట్ చేయడంతో వైసీపీ ట్విట్టర్ నిర్వాహకులు అవాక్కయ్యారు. అంతేకాకుండా ప్రొఫైల్ ఫోటోగా కోతి బొమ్మను పెట్టారు. శుక్రవారం అర్ధరాత్రి తమ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు వైసీపీ సాంకేతిక బృందం గుర్తించింది. దీంతో వెంటనే ట్విట్టర్ టెక్నికల్ సపోర్ట్ టీమ్‌కు సమాచారం అందించింది. తీవ్రంగా శ్రమించిన ట్విట్టర్ టీమ్…
ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. ఈ ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. లిక్కర్ స్కాంలో సాక్షిగా కవిత వాంగ్మూలం నమోదు చేసింది. నేటి విచారణలో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం పాల్గొంది. లిక్కర్…
Tirupathi: ఏపీలో మాండూస్ తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ దాటికి శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టంబేడు పోలీస్ స్టేషన్ నీట మునిగింది. ఈ సందర్భంగా స్టేషన్‌లోని అన్ని గదుల్లోకి వర్షం నీరు భారీగా చేరింది. దీంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం స్టేషన్లోకి వచ్చిన నీటిని మోటార్ల ద్వారా తొలగించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ నీటి మునిగిన…
Ambati Rambabu: ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై టీడీపీ విషం చిమ్ముతోందని.. వాలంటీర్లు హత్యలు, అత్యాచారాలు, మోసాలు, అనేక ఘోరాలు చేస్తున్నారని టీడీపీ మీడియాలో రాస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజలకు పాలనను ప్రజల గుమ్మం వరకు వెళ్ళి అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ఇలా తప్పుడు కథనాలను టీడీపీ నేతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు పనికి రేటు పెట్టి మరీ…
Vijayawada: విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణలకు సిద్ధమైంది. ఈనెల 15 నుంచి 19 వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఉంటాయని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ సందర్భంగా భవానీ దీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. కరోనా తరువాత ప్రస్తుత పరిస్థితి సాధారణం కావడంతో ఈ ఏడాది 7లక్షల మంది వరకు భవానీలు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈనెల 15వ తేదీ ఉదయం 6గంటల నుంచి దీక్షల విరమణ ప్రారంభం…
రేపు ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. ఈనెల 14న బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు. ఢిల్లీలో డిసెంబర్ 14న ఎస్పీ రోడ్ లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారభించనున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని , జాతీయ కార్యవర్గాన్ని అదే రోజు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందుగానే మంత్రి నిరంజన్ రెడ్డి,…
Andhra Pradesh: మాండూస్ తుఫాన్ ఏపీలోని పలు ప్రాంతాల ప్రజలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా 32 మండలాలలో తుఫాన్ ప్రభావం ఉంది. లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. 33 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. 778 మందికి పునరావాసం కల్పించారు. ఈ నేపథ్యంలో మాండూస్ తుఫాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయాన్ని విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వ్యక్తికి రూ.1000, కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున…