AP Inter Exams 2023: ఇంటర్ విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న పరీక్షల తేదీలు రానేవచ్చాయి.. ఏపీ ఇంటర్ 2023 పరీక్షలకు సంబంధించిన టైంటేబుల్‌ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు.. 2023 మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న పరీక్ష.. మధ్యాహ్నం 12 గంటలకు ముగియనుంది. మరోవైపు, ఏప్రిల్ నుంచి మే నెల రెండో వారం వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది ఇంటర్మీడియట్ బోర్డు.. ఇక, ఏ తేదీన ఏఏ పరీక్షలు జరగనున్నాయి.. సమయం ఏంటి? ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష తేదీలు ఎప్పుడు..? రెండో సంవత్సరం ఎగ్జామ్స్ ఎన్నడు నిర్వహించనున్నారు.. ఇలా పరీక్షలకు సంబంధించిన పూర్తి టైంటేబుల్‌ను కింది టేబుల్‌లో పరిశీలించవచ్చు.