Botsa Satyanarayana: మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈనెల 16 లేదా 17వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా వర్క్ షాప్ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసుకోవడానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి వైసీపీ నేతలందరూ సమిష్టిగా పని చేయాలని బొత్స సూచించారు.…
Kakani Govardhan Reddy: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు ట్వీట్లు చేస్తున్నారని.. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పరిపాలన ప్రభావం వల్లే రైతుల ఆత్మహత్యలు కొనసాగాయని ఆరోపించారు. టీడీపీ హయాంలో రైతులకు చేసిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో 1623 మండలాలను కరువుగా ప్రకటించారని ఎద్దేవా…
Andhra Pradesh: ఏపీలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. రీసర్వే పనుల్లో ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడిపై ఏపీ వీఆర్వోలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 12 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వీఆర్వోలు వెల్లడించారు. భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా వీఆర్వోల సంఘం నేత భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…
GVL Narasimha Rao: రాష్ట్ర విభజన అంశంపై మరోసారి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. రాష్ట్ర విభజనపై ఏపీలో విచిత్ర చర్చ జరుగుతోందని.. గతంలో వైసీపీ కూడా విభజనకు లేఖ ఇచ్చిందని జీవీఎల్ గుర్తుచేశారు. అప్పుడు అలా చేసి.. ఇప్పుడు విభజనను వ్యతిరేకించామని వైసీపీ కొత్త కహానీలు చెబుతోందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు కలవాలనే నినాదం తీసుకురావడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు…
AP BJP: తాను అధికారంలోకి వస్తే వడ్డీతో సహా సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్లపై బీజేపీ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేసింది. అభివృద్ధిని గాలికి వదిలేసి సంక్షేమం పేరుతో నిధులు దారిమళ్లించి ఏపీని సీఎం జగన్ 90 శాతం నాశనం చేస్తే తాను 100 శాతం నాశనం చేస్తానని మాజీ సీఎం చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అని బీజేపీ ట్వీట్ చేసింది.…
Kollu Ravindra: టీడీపీ బీసీ సాధికార కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ సోదరులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడకుండా సీఎం జగన్ అవమానించారని ఆరోపించారు. వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే కానీ బ్యాక్ బోన్ కాదన్నారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని విజయవాడ సాక్షిగా జగన్ బహిరంగంగా ప్రకటించారని.. పెద్ద పీట వేయడమంటే నిల్చోబెట్టి అవమానించడమేనా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని..…
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పరితపిస్తుంటారు.. ఆర్జిత సేవాల్లో పాల్గొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.. ఆన్లైన్ టికెట్ విధానం వచ్చిన తర్వాత.. భక్తులు టికెట్లను ఆన్లైన్ లోనే బుక్చేసుకుంటున్నారు.. ఇక, ఎప్పుడు అధికారులు టికెట్లను ఆన్లైన్లో పెడతారా? బుక్ చేసుకోవాలా? అని వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.. ఆ సమయం రానేవచ్చింది.. డిసెంబర్ 12న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. 2023 జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి…
టీడీపీ అధినేత చంద్రబాబును మరోసారి టార్గెట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. అనంతపురం పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క గొప్ప విషయం లేదని ఎద్దేవా చేశారు.. ఇక, ఆయన ఎంత ప్రయత్నించినా ముఖ్యమంత్రి కాలేరంటూ జోస్యం చెప్పారు.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నినాదం 175కి 175 స్థానాల్లో విజయం.. అందుకోసం మాకు అప్పగించిన బాధ్యతలు మేరకు కార్యకర్తలతో సమావేశం అవుతున్నామన్నారు.. దేశంలో ఏ ముఖ్యమంత్రి…