Naga Babu: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి కీలక నేతలు విమర్శలు గుప్పించారు. అన్నయ్య షోకు డుమ్మా.. బాలయ్య షోకు జమ్మ.. రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. మంత్రి అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు. ‘ఏయ్.. ముందెళ్లి పోలవరం సంగతి చూడవోయ్.. వె.ధ.వ.సోది’ అంటూ సమాధానం ఇచ్చారు.
Read Also: 2022 Filmy Rewind: అభిమానులను విడిచి దివికేగిన తారలు!
ప్రస్తుతం జలశాఖ మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తనకు తెలియదని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు చేయగా.. నాగబాబు తాజాగా ఇచ్చిన రిప్లై అదిరిపోయిందంటూ జనసేన అభిమానులు చురకలు అంటిస్తున్నారు. అటు మెగా అభిమానులతో నాగబాబు ప్రత్యేకంగా ముచ్చటించాడు. మెగా ఫ్యాన్స్ గమనించాల్సిన విషయమేమంటే అభిమానులందరూ చాలా పవర్‌ఫుల్ ఆర్గనైజేషన్ అని.. ఇక్కడే కాదు.. ఇండియాలోనే ఇంత పవర్ఫుల్ ఆర్గనైజేషన్ మరో నటుడికి లేదని నాగబాబు చెప్పారు. చిరంజీవి లేదా ఆయన కుటుంబం మీద కానీ ఈగ వాలినా ఎంతకైనా వెళ్లగలిగే వ్యక్తులు మెగా అభిమానులు అంటూ ప్రశంసలు కురిపించారు.
ఏయ్.. ముందెళ్ళి పోలవరం సంగతి చూడవోయ్ …వె.ధ.వ సోది !!! @AmbatiRambabu @JanaSenaParty @JSPShatagniTeam #janasainiks
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 27, 2022