What’s Today:
* ఢిల్లీ: నేడు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. పోలవరం ప్రాజెక్టు, ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించనున్న సీఎం జగన్ః
* ప్రకాశం: ఇవాళ కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. టంగుటూరు టోల్ ప్లాజా నుండి కందుకూరు వరకూ రోడ్ షో.. కందుకూరులో బహిరంగ సభలో మాట్లాడనున్న చంద్రబాబు
* నేడు భద్రాచలంలో సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి పర్యటనతో భద్రాచలంలో పోలీసుల ఆంక్షలు
* వరంగల్: నేడు రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
* అన్నమయ్య జిల్లా: నేడు హార్సిలీ హిల్స్‌లో పర్యటించనున్న జిల్లా కలెక్టర్ గిరీషా.. కొండపై కొత్తగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించనున్న కలెక్టర్
* కడప: బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. హాజరుకానున్న మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా