తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కోర్టు ఉత్తర్వులు అమలు చెయ్యలేదని టీటీడీ ఈవోకు శిక్ష విధించింది.. దాంతో పాటు రూ. 2 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా.. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు ఈ తీర్పు వెలువరిస్తున్నామని స్పష్టం చేసింది. కాగా గతంలో టీటీడీలో పని చేస్తున్న ముగ్గురు తాత్కాలిక సిబ్బంది క్రమబద్దీకరణ కోసం కోర్టును ఆశ్రయించగా, ముగ్గురిని క్రమబద్దీకరించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే,…
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక గడువును నేపథ్యంలో సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని.. చేసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సూచించారు. భూమిని కొనుగోలు చేసినప్పటికీ పట్టాలు పొందనివారు లక్షల్లో ఉన్నారని వారందరూ తమ హక్కు పత్రాలు పొందగలిగేలా ప్రభుత్వం నూతన అవకాశం ఇచ్చిందన్నారు.. సాదా బైనామా పత్రాల క్రమబద్దీకరణపై మంగళగిరి భూపరిపాలనా శాఖ ఛీఫ్ కమీషనర్ కార్యాలయం వేదికగా అన్ని జిల్లాల నుండి ఎంపికచేసిన డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు,…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వెస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బుధవారం రోజు విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.. రేపు ఓ వైసీపీ ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి.. మరో వైపు మాజీ మంత్రి కూతురు పెళ్లి వేడుకకు హాజరుకాబోతున్నారు.. రేపు విశాఖ వెళ్లనున్న ఆయన.. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు.. అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి…
ఆంధ్రప్రదేశ్ నుంచి ‘అమరరాజా’ వెళ్లిపోయింది.. ఒక అమరరాజానే కాదు అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీకి బైబై చెప్పేస్తున్నాయి అనే విమర్శలు వచ్చాయి.. తెలంగాణలో అమరరాజా బ్యాటరీస్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమై.. తెలంగాణ సర్కార్‌తో ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత.. ఈ విమర్శలు మరింత పెరిగాయి.. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్న ఆ సంస్థ.. ఇందు కోసం రూ. 9,500 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు రెడీ అయిపోయింది.. దీనికి…
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు.. ప్రగతి గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా టీడీపీ.. చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. తన హయాంలో రూ. 5 లక్షల కోట్లు పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు తెచ్చామని చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూల్లో కేవలం రూ. 34 వేల…
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.. పెన్షన్ దారులకు ఆనందాన్నిచ్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్న ఆయన.. రూ. 2,500 నుంచి రూ. రూ. 2,750కు పెంచేందుకు నిర్ణయించాం.. దీని వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ. 134 కోట్లు ఖర్చు అవుతుందని.. అయినే.. సంక్షేమ పథకాల అమల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు.. నిజం ఎలా ఉంటుందంటే.. జగన్‌లా ఉంటుందని…
మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. డీఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు అనంతబాబు. గతంలో విచారణకువచ్చిన సమయంలో ప్రతి వాదులకు నోటీసులు జారీ చేశారు. నిన్న జరిగిన విచారణలో బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది అత్యున్నత న్యాయస్థానం.. అయితే, బెయిల్ షరతులపై కింది కోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.. అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను రాజమండ్రిలోని ఎస్సీ ఎస్టీ…
CM Jagan: అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించి మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. రూ.2,500 పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ.2,750కి పెంచుతున్నట్లు కేబినెట్ ప్రకటించింది. ఫలితంగా 62.31 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. జనవరి 1 నుంచి పెంచిన పెన్షన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు వైఎస్ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్…
Payyavula Keshav: ఏపీ కేబినెట్ సమావేశంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్లో నిర్ణయాలు ప్రజల కోసం కాకుండా అయిన వారి కోసమే నిర్ణయాలు ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. కేబినెట్లో నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి చిక్కులు తమ మెడకు చిక్కుకోవని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన సుమారు 20 వేల మెగావాట్ల మేర హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం…