ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అప్పుడే హీట్ పెంచుతున్నాయి.. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలతో మాటల యుద్ధమే నడుస్తోంది.. మరోవైపు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు.. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. అయితే, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కీలక నేత, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటకి వెళ్లారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. దీంతో, ఏపీ…
వారాహి జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం.. వారాహితో యాత్రకు సిద్దమయ్యాం.. కానీ, వారాహి వాహనంపై పేర్ని నాని రకరకాల అననమానాలు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. అయితే, జనసేన చట్టానికి లోబడే కార్యక్రమాలు చేపడుతోందన్న ఆయన.. సంస్థాగతంగా పార్టీ ఇంకా బలోపేతం కావాల్సి ఉందన్నారు.. ఇప్పటికే 9 జిల్లాల్లో సంస్థాగత పటిష్టతపై చర్యలు చేపట్టాం… వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథమే.. సంస్కృతిని గౌరవించుకునే విధంగా వారాహి పేరు…
VijayaSaireddy: టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా సోషల్ మీడియాలో మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ఈ సందర్భంగా మొన్న అచ్చన్న.. నిన్న స్వయంగా చంద్రబాబే ‘పార్టీ లేదు-బొక్కాలేదు’ అన్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రోజురోజుకూ టీడీపీ నిర్వీర్యం అయిపోతోందని చంద్రం అన్నయ్యే తేల్చేశాడని చురకలు అంటించారు. ఎల్లో మీడియా ఎన్ని బాకాలు ఊదినా.. పెగ్గురాజు ఢిల్లీలో ఎంత పేలినా ఇక లాభం…
Jogi Ramesh: సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో వైఎస్ జగన్ విజయవాడ ఈస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ (EPL)-2022 టోర్నమెంట్‌ను మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరయ్యారు. డిసెంబర్ 21 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈపీఎల్ టోర్నమెంట్ విజేతకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగామంత్రి జోగి రమేష్ కాసేపు క్రికెట్…
AP High Court: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామస్తులకు ఏపీ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఇప్పటం గ్రామంలో ప్రభుత్వ కూల్చివేతలపై నోటీస్ ఇవ్వకుండా కూల్చారంటూ.. ఇప్పటం గ్రామస్తులు గతంలో హైకోర్టుకు వెళ్లారు. అయితే తాము నోటీసులు ఇచ్చే కూల్చివేతలు చేపట్టామని ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో.. ఈ కేసుకు సంబంధించి 14 మంది పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ మేరకు సింగిల్ బెంచ్…
Gudivada Amarnath: విశాఖలో రెండో రోజు వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, విడదల రజినీ, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్ కుమార్, అదీప్ రాజు, ఎమ్మెల్సీలు వంశీ, వరుదు కళ్యాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుంచి విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందని…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టీమేటం జారీ చేశారు. సంక్రాంతిలోగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ఏపీ అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రావాల్సిన బకాయిలు అడుగుతామనే సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఆందోళన సృష్టిస్తున్నారని ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతభత్యాల చెల్లింపు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం జగన్…
What’s Today: * నేడు విశాఖ, గుంటూరు జిల్లాలలో ఏపీ సీఎం జగన్ పర్యటన * నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు.. తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడికి నిరసనగా పిలుపు.. నేడు అన్ని మండలాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసనలు * ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ * నేడు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ * నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్.. ఉదయం…
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సబ్ రీజియన్స్‌లో ఒకటి ఉత్తరాంధ్ర. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కలిపి మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంత ఓటర్ల తీర్పు ఏకపక్షమైన ప్రతీసారీ పార్టీలు అనూహ్యమైన విజయాలను కైవశం చేసుకుంటున్నాయి. 1994 ఎన్నికల్లో తొలిసారి ఉమ్మడి అభ్యర్థులతో కలిపి 33స్థానాలను గెల్చుకుంది టీడీపీ. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి కళా వెంకట్రావు ఒక్కరే ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ 2019లో వైసీపీ గాలి వీచింది. 28 చోట్ల గెలిచి…
జాతీయ స్థాయిలో చక్రం తిప్పిందేకు టీఆర్ఎస్ పార్టీ పేరును కాస్తా బీఆర్ఎస్గా మార్చేశారు.. పొరుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై కూడా బీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. ఏపీలో ముఖ్య నేతలపై బీఆర్ఎస్ కన్నేసిందా..? అలాంటి వారిని గుర్తించి బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందా..? అంటే విశాఖలో జరిగిన ఓ పరిణామం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణతో సమావేశం అవ్వడానికి తెలంగాణ…