మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పంచాయితీ హాట్‌టాపిక్ అయ్యింది.. చివరకు అది సీఎం వైఎస్ జగన్‌వరకు చేరింది.. మంత్రి జోగి రమేష్, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడిచింది.. చివరకు అది వైసీపీ అధిష్టానం వరకు వెళ్లింది.. ఇక, వరుసగా వివిధ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అవుతూ వచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఇవాళ మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు.. ఈ సారి మన టార్గెట్ 175కి 175…
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైలవరం పంచాయితీ హాట్‌టాపిక్‌గా సాగుతూ వచ్చింది.. చివరకు అది సీఎం వైఎస్ జగన్‌వరకు చేరింది.. మంత్రి జోగి రమేష్, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తూనే ఉంది.. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి.. ఇప్పటికే వైసీపీ అధిష్టానం వారిని సముదాయించే ప్రయత్నాలు చేసింది.. ఇక, పార్టీ అధినేత, సీఎం జగన్ వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో.. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. రాష్ట్రంలోని…
National Clean Air Programme: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద గాలి నాణ్యతను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని పట్ణాలను ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.. విజయవాడ, విశాఖపట్నంతోపాటు అదనంగా మరో 11 పట్టణాలను ఎంపిక చేసినట్లు పర్యవరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే పార్లమెంట్ వేదికగా వెల్లడించారు. రాజ్యసభలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు.. రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన అశ్వినీకుమార్ చౌబే.. 15వ ఆర్థిక సంఘం…
పొత్తులు.. ఎత్తులు.. లాంటి చచ్చు ఆలోచనలు మాకు లేవు అని స్పష్టం చేస్తూనే.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. పార్టీలో ఊపులేక చంద్రబాబు ముందస్తు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేసిన ఆయన.. హామీలు అమలు చేసి ఐదేళ్లు పూర్తి అయ్యాక ప్రజలకు చెప్పి ఎన్నికలకు…
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సర్కార్ కసరత్తు చేస్తోంది.. కేంద్ర ప్రభుత్వ పర్వత మాల ప్రాజెక్టులో భాగంగా రోప్ వేల ఏర్పాటుపై ప్రణాళికలు సిద్దం చేస్తోంది సర్కార్.. ఈగల పెంట-శ్రీశైలం మధ్య రోప్ వే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. ప్రీ ఫీజుబులిటి స్టడీ పూర్తి చేశారు.. మార్చి నెల నుంచి ఈగల పెంట-శ్రీశైలం మధ్య రోప్ వే ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. ఇదే కాకుండా.. మరో మూడు…
పండుగలు వచ్చాయంటే చాలు.. ప్రత్యేక సర్వీసులను నడపడం.. ఇదే సమయంలో చార్జీలను భారీగా పెంచి క్యాష్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే.. ఈ సమయంలో అందినకాడికి దోచుకుంటాయనే విమర్శలు ఉన్నాయి.. అయితే, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ).. జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది.. ఇదే…
అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇటీవల వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కావాలని చేసుకుంటున్నారో లేక అనుకోకుండా జరుగుతోందో కానీ.. సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో రాప్తాడులో జరుగుతున్న సంఘటనలు పీక్ స్టేజ్ కి వెళ్తున్నాయి. గతంలో పరిటాల కుటుంబంపై సుధీర్ఘ పోరాటం తరువాత 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి విజయం దక్కింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. తర్వాత ఆయనకు అన్నీ సమస్యలే. అధికారం లేనప్పుడు నాయకులకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే…
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ను విస్తరించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. వైసీపీ గెలుపునకు అన్ని విధాలా సహకరించారు. తెలంగాణలో అనుసరిస్తున్న వ్యూహాన్ని.. త్వరలో ఏపీలోనూ అమలు చేసే దిశగా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు బీజేపీకి, మరోవైపు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ తర్వాత…