Liquor Sales: 2022 ఏడాదికి బైబై చెప్పి.. 2023 ఏడాదికి స్వాగతం పలుకుతోంది ప్రపంచం.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ జోరందుకున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. న్యూఇయర్ జోష్‌తో భారీగా పెరిగాలయి లిక్కర్ సేల్స్.. గత మూడు రోజుల నుంచి భారీగా మద్యం అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఈ నెల 29వ తేదీన సుమారు రూ. 73 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరగగా.. ఈ నెల 30వ తేదీన ఏకంగా రూ. 108 కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ జరిగాయి.. ఇవాళ సాయంత్రానికే రూ. 71 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగాయి.. మామూలు రోజుల్లో ఏపీలో సరాసరి రోజుకు రూ. 64 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి.. కానీ, న్యూఇయర్ జోష్‌లో సేల్స్ పెరిగాయి.
Read Also: Chennakesava Reddy: వీఆర్‌వోలను తొలగిస్తే గ్రామలకు పట్టిన పీడ పోతుంది.. వారిని అటెండర్లుగా పంపాలి..!
ఇక, కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రెండింతల కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇవాళ ఒక్క రోజే సుమారు రూ. 130 కోట్ల నుంచి రూ. 150 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.. డిసెంబర్-31న మద్యం అందుబాటులో ఉంటుందో లేదోనని మందుబాబులు రెండు రోజుల ముందు నుంచే మద్యం కొనుగోళ్లు చేస్తున్నారు.. అత్యధికంగా ఇవాళ విశాఖలో రూ. 9 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగగా.. అత్యల్పంగా అనంతపురంలో రూ. 3 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.. అయితే గతేడాది కంటే ఈసారి మద్యం అమ్మకాలు తక్కువేనంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అధికారులు.