త్వరలో పెళ్ళి చేసుకోబోతున్న నరేష్-పవిత్ర లోకేష్

త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు నరేష్, పవిత్ర లోకేష్.. ముద్దుపెడుతున్న వీడియోను షేర్ చేసిన నరేష్… కొత్త ఏడాది, కొత్త ప్రారంభం అంటూ ట్వీట్ చేశారు నరేష్… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఈమధ్యకాలంలో ఈ ఇద్దరు కలిసి వున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అందరూ బాగుండాలి.. అందులో మేముండాలి అన్నారు. పలు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. నరేష్ గత కొంతకాలంగా మూడవ భార్యకు దూరంగా ఉంటున్నారు. ఇటు పవిత్ర లోకేష్ కూడా భర్తకు దూరంగా ఉంటున్నారు. వీరిద్దరి సంబంధంపై వివిధ రకాల కథనాలు వచ్చాయి. వీటిపై ఆమె న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. అందరి ఆశీస్సులు కావాలని కోరింది కొత్త జంట నరేష్, పవిత్ర. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన వీడియో సంచలనంగా మారింది. కేక్ కట్ చేసి పరస్పరం లిప్ లాక్ చేసుకున్నారు. పవిత్ర నరేష్ అని #pavitranaresh అని హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేశారు. అతి త్వరలో వివరాలు ప్రకటిస్తామన్నారు.
అయ్యప్ప భక్తుల ఆందోళన….వరంగల్ లో బైరి నరేష్ అరెస్ట్

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప స్వామి, హిందూ దేవీదేవతలపై, అయ్యప్ప మాలధారులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల కోడంగల్ లో అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై వికారాబాద్ జిల్లాలో కేసు నమోదు అయింది. గత మూడు రోజులుగా నరేష్ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు నాలుగు టీంలను ఏర్పాటు చేసి నరేష్ కోసం గాలింపు చేపట్టారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ధృవీకరించారు. కాసేపట్లో బైరి నరేష్ ను కోడంగల్ తరలించనున్నారు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నరేష్ ఎక్కడున్నాడనే వివరాలను పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. కేసు నమోదు అయినా తన వ్యాఖ్యలు సమర్థించుకుంటూ తన యూట్యూబ్ ఛానెల్ లో మరో వీడియో పోస్ట్ చేశాడు.
2022 వైసీపీకి విజయనామ సంవత్సరం

2022 వైసీపి ప్రభుత్వానికి విజయ నామ సంవత్సరం అన్నారు ఏపీ గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్. అన్ని వర్గాలకు ఆనందం నింపిన సంవత్సరం. ఏ ఎన్నిక జరిగినా విజయ పరంపరతో గెలిచిన సంవత్సరం అన్నారు జోగి రమేష్. మా లీడర్ జగన్ నాయకత్వంలో 2022 విజయ నామ సంవత్సరం. ఇదే 2022 చంద్రబాబు కు బూతుల నామ సంవత్సరంగా మారిందన్నారు. ప్రతి ఎన్నికల్లో ఆఖరికి చంద్రబాబు అడ్డా కుప్పం మున్సిపాలిటీతో సహా ఘోరంగా ఓడి పోయిన సంవత్సరం ఇదే అన్నారు జోగి రమేష్. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు నుంచి దత్తపుత్రుడు వరకు 2022 బూతుల సంవత్సరం అయిందన్నారు. మళ్ళీ మా బీసీలంతా ఇస్త్రీ చేసుకుంటూ, మగ్గాలు నేయాలని చెప్తారా ? జగనేమో మా బీసీలంతా ఉన్నతస్థాయికి చేరుకోవాలని చూస్తున్నారు. ట్యాబ్ లు, బైజూస్ కంటెంట్ తో చదువుకుని ప్రపంచాన్ని ఏలాలని చూస్తుంటే.. చంద్రబాబు మాత్రం మళ్ళీ చేపలు పట్టుకోవాలని, ఇస్ర్తీ చేసుకోవాలని చెప్తున్నారు. చంద్రబాబు, ఆయన కులం వాళ్ళే ఇంగ్లీషు చదువుకుని ఇతర దేశాలకు వెళ్లాలా? దుర్మార్గపు ఆలోచనలు చేసే నీకు మళ్ళీ ఎందుకు అధికారం ఇవ్వాలి? కందుకూరులో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు. మీరంతా ఇక్కడే ఉండండి, మళ్ళీ వస్తానని అన్నాడు. ఆయనకి చిన్నమెదడు చితికిపోవడం వలనే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్.
జగన్, ధర్మానపై మండిపడ్డ సీపీఐ నేత రామకృష్ణ

సీఎం జగన్ దిగజారి మాట్లాడుతున్నారు.. మంత్రి ధర్మాన మతి భ్రమించి మాట్లాడుతున్నారు. విశాఖ కేంద్రంగా చిన్న రాష్ట్రం ఏర్పాటు చేయాలనడం మంత్రి ధర్మాన ప్రసాదరావు అవివేకానికి నిదర్శనం. ధర్మాన మంత్రి పదవికి అనర్హుడు. అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగమే ధర్మాన విపరీత వ్యాఖ్యలు. అసలు ఏపీకి రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచనే జగనుకు లేదు. కందుకూరులో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయటం జగనుకు, ఆయన సలహాదారులకు తగదు. చంద్రబాబు వల్లే కందుకూరు మరణాలు జరిగి ఉంటే ఆయనపై హత్యానేరం కేసులు ఎందుకు మోపలేదు? అని ఆయన ప్రశ్నించారు.
భక్తుల నుంచి వ్యతిరేకత.. ఆ నిర్ణయం వెనక్కి

ఏపీఎస్ఆర్టీసీ ఒక నిర్ణయం భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకోక తప్పలేదు. వచ్చే 10 రోజులు టోకెన్లు ఉంటేనే ఆసీ బస్సుల్లోకి భక్తులను అనుమతి ఇస్తామన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది ఆర్టీసీ. భక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠ ద్వారం తెరిచే పది రోజులు దర్శన టోకెన్లతో సంబంధం లేకుండా యధావిధిగా ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి భక్తులు తమ ప్రయాణాలు చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది తిరుమలకు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. అయితే, ఈ సమయంలో.. ఏపీఎస్‌ఆర్టీసీ, తిరుపతి విభాగం ఓ నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారం తెరిచి ఉంచే 10 రోజులపాటు దర్శన టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వెంకన్న భక్తులు మండిపడ్డారు. అసలు, శ్రీవారి దర్శనానికి, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధం ఏంటి? అని మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు.
డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ .. ఏం మాట్లాడారంటే?

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు పదవీవిరమణ చేయనున్నారు. శనివారం తెలంగాణ పోలీస్ అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 36 ఏళ్లుగా పోలీస్ శాఖలో పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కొత్త డీజీపీగా నియమితులైన అంజనీ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. అంజనీ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీస్ శాఖ మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. తనకు సర్వీసులో సహకరించిన హోం గార్డులకు, పోలీస్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ఏర్పడ్డాక శాంతిభద్రతల గురించి అపోహలున్నా.. వాటిని అధిగమించి శాంతియుతంగా ముందుకెళ్తున్నాం అని అన్నారు. ఆపదలో ఉన్నవారికికి పోలీసులున్నారనే నమ్మకాన్ని ఇచ్చామని.. పోలీస్ శాఖలో పనిచెస్తున్న వారి జీతభత్యాలు, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులకు 30శాతం అలవెన్సులు, హోమ్ కార్డులకు 20 వేల జీతాన్ని ఇస్తుందని వెల్లడించారు. ఇప్పటికే 27 వేల పోలీసులను రిక్రూట్ చేసుకోగా… త్వరలో మరో 17 వేల మంది పోలీస్ శాఖలో చేరనున్నారని వెల్లడించారు. పోలీస్ శాఖలో టెక్నాలజీని ఉపయోగించి ఎన్నో కేసులు పరిష్కరించామని.. రానున్న రోజుల్లో నేరాలు డిజిటల్ రూపంలోకి మారుతాయని.. కాబట్టి పోలీసులంతా టెక్నాలజీతో అప్డేట్ అవ్వాలని సూచించారు. విజనరీ దృష్టిలో ఉంచుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్ ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు పాటించాల్సిందే

న్యూ ఇయర్ వేడుకలు హైదరాబాద్‌లో ఓ రేంజ్ లో జరగనున్నాయి. అయితే ఈ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వీటిని అంతా పాటించాలని పోలీసులు పేర్కొన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఇవి అమలు చేస్తున్నారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అయితే బేగంపేట, లంగర్‌హౌస్ ఫ్లై ఓవర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌పై వాహనాలకు అనుమతి నిలిపివేశారు. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత నగరంలోకి లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలను నిషేధించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు వుంటాయని పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, నగరం నుంచి ఎయిర్‌పోర్టు వైపు వెళ్లే కార్లకు రాత్రి 10 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విమాన టిక్కెట్లు చూపిస్తే పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీద నుంచి రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. మద్యం సేవించి బండి నడిపితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు.
షోరూమ్ కి వెళ్తే దండిగా దొరుకుతాయి టైర్లు…
ఇప్పటివరకూ పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తామని వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ చెప్పినప్పుడు, అందరూ షాక్ అయ్యారు. పాన్ ఇండియానే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంటే, బాహుబలి ఇమేజ్ ఉన్న ప్రభాస్ తో కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న ‘నాగ్ అశ్విన్’ పాన్ వరల్డ్ సినిమా చెయ్యడం ఏంటి? అసలు అతను హ్యాండిల్ చెయ్యగలడా అనే అనుమానం అందరిలోనూ కలిగింది. మహానటి లాంటి క్లాసిక్ సినిమా తీసినా కూడా ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చెయ్యడం అనేది చాలా కష్టమైన పని. కథతో పాటు స్టార్ హీరో ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకోని సినిమా చెయ్యాలి. ఈ విషయం చాలా బాగా తెలిసిన వాడు కాబట్టే నాగ్ అశ్విన్, ఇప్పటివరకూ ఉన్న కథతో… ఇప్పటివరకూ వాడిన ఎలిమెంట్స్ ని వాడకుండా సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ‘ప్రాజెక్ట్ K’ సినిమా చెయ్యడానికే కష్టం అండి, ఈ సినిమా ఎలా వర్కౌట్ చెయ్యాలని అనే దానికే టైం ఎక్కువ పడుతుంది. మొత్తం స్క్రాచ్ నుంచి క్రియేట్ చెయ్యాలి అని చెప్పాడు. ఆ స్కార్చ్ అనే పదం నాగ్ అశ్విన్ నోటి నుంచి ఎప్పుడు బయటకి వచ్చిందో, అప్పటినుంచి అందరిలోనూ “నాగ్ అశ్విన్ ఎదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు” అనే ఫీలింగ్ కలిగింది.
కొత్త ఏడాదిలో నియామకాలపై సర్వే

ఇండియన్ జాబ్ మార్కెట్‌లో కొత్త సంవత్సరం నియామకాల జోరు నెలకొననుంది. ముఖ్యంగా స్పెషలైజ్డ్ ఐటీ, టెలికం అండ్ సేవల ఆధారిత రంగాలు ఈ రిక్రూట్‌మెంట్లలో జోష్ నింపనున్నాయి. రిటైల్, ఇ-కామర్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీల హైరింగ్‌లో పండుగ సీజన్ ఉత్సాహం ఈ ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది.ఆతిథ్యం మరియు ఎయిర్‌లైన్ సెక్టార్లలో సైతం ఇదే ట్రెండ్ కంటిన్యూ కానుంది. స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ సర్వీసెస్ సంస్థ ర్యాండ్‌స్టాడ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీ రిపోర్ట్ ప్రకారం.. 2023లోని మొదటి మూడు నెలల్లో ఐటీ రంగం కొత్తవారికి భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వనుంది. ప్రతి 10 కంపెనీల్లో 7 కంపెనీలు స్టాఫ్‌ను పెంచుకోనున్నాయి. డేటా సైన్స్, అనలిటిక్స్, ఇతర టెక్నాలజీ సంబంధిత జాబ్ రోల్స్‌కి కూడా డిమాండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.డిజిటలైజేషన్ పెరగనుండటం, 5జీ సాంకేతికత విస్తరించనుండటం, సర్వీస్‌లో గ్రోత్ లెవల్స్ కొవిడ్ ముందు నాటి పరిస్థితులకు చేరనుండటం ఇందుకు కారణాలని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సంస్థలు లేఆఫ్‌లు ప్రకటిస్తుండగా ఇండియన్ ఐటీ సంస్థలు మాత్రం దీనికి భిన్నంగా కొలువుల మేళాలకు తయారవుతుండటం విశేషం. శాప్, సేల్స్‌ఫోర్స్ డెవలపర్స్, డాట్ నెట్, డేటా అనలిటిక్స్, జావా, ఫుల్ స్టాక్, డెవలప్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రా వంటి ఐటీ డిజిటల్ స్కిల్స్ ఉన్నోళ్లకు ఎక్కువ జాబులొచ్చే ఛాన్స్ ఉన్నాయి.