తమిళనాడులో బాంబు పేలుడు… నలుగురి దుర్మరణం

తమిళనాడు రాష్ట్రంలో బాంబు పేలుడు జరిగింది. నామక్కల్ జిల్లా మోగనూరులో ఓ ఇంట్లో శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలోొ ఇంట్లో నాటు బాంబులు తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. పేలుడు ధాటకి పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.అర్థరాత్రి ఇంట్లో ఫైర్ వర్క్ చేస్తుండగా పేలుడు సంభవిస్తున్నట్లు భావిస్తున్నారు. పేలుడుతో సమీప ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం గాయపడిన ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బాంబుల పేలుళ్లతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఏజెన్సీల్లో చలి తీవ్రత.. పాడేరుని వణికిస్తున్న పొగమంచు

ఏపీలో చలితీవ్రత బాగా పెరిగింది. ముఖ్యంగా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత బాగా ఎక్కువగా ఉంది. పొగ మంచు దట్టంగా కురుస్తుండడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పాడేరులో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మినుములూరులో అత్యల్పంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2022 ఏడాది ముగుస్తుండడంతో కొత్త సంవత్సరం ఆదివారం కావడంతో పర్యాటకుల తాకిడి అరకు, సమీప ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాడ్జ్,హోటళ్ళు రిసార్ట్ లు శనివారం నుండే ముందస్తుగా నిండుకున్నాయి. ధరలు పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నాయి హోటళ్ళు. పర్యాటక ప్రాంతాల్లో ఇప్పటికే పర్యాటకులను ఆకర్షించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది టూరిజం శాఖ. రేపటి నుండి 1,2తేదీల్లో లంబసింగిలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇటు ఏపీ, తెలంగాణల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగినా రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. గత వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులున్నా చలి తీవ్రత తగ్గడం లేదు. రోడ్లపై పొగమంచు ఇబ్బంది పెడుతోంది. రోడ్లు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం దట్టమైన పొగమంచు కప్పేస్తుంది
ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. సైనస్ చికిత్సతో బాలిక మృతి

ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకం ఓ బాలిక ప్రాణాలు తీసింది. వైద్యం పేరుతో ఐదేళ్ల బాలిక మృతికి కారణం అయింది. రాజేంద్రనగర్ కాటేదాన్ లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 29న అనారోగ్యంతో బాధపడుతున్న సాన్విక అనే ఐదేళ్ల బాలికను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక సైనస్ తో బాధపడుతుందని వెంటనే ఆస్పత్రి చేయాలని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. తమ కూతురును ఎలాగైనా బతికించాలని ఆ కుటుంబం వైద్యులను వేడుకుంది. అయితే రెండు రోజులు ఐసీయూలో చికిత్స అందించారు. ఆ తరువాత బాలిక మరణించింది. బాలిక పరిస్థితి విషమించడంతో సదరు ఆస్పత్రికి నగరంలోని వేరే ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. ఇదంతా తల్లిదండ్రులకు చెప్పకుండా ఆస్పత్రి జాగ్రత్త పడింది. అయితే వేరే ఆస్పత్రికి తరలించే సమయానికే సాన్విక మరణించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఉత్తరాంధ్రను వీడని రాయల్ బెంగాల్ టైగర్స్ టెర్రర్

పులుల పేరు చెబితే తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పులులు ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. టైగర్ ట్రాకింగ్ లో బయటపడ్డ ఆడ, మగ పెద్ద పులులు సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏజెన్పీ ప్రాంతాల్లో ఎక్కడినించి పులులు వస్తాయోనని జనం భయపడిపోతున్నారు. ముఖ్యంగా పాడేరు అటవీ డివిజన్ పరిధిలోని రభ బీట్ ఏరియాలో మగ పులి….విజయనగరం అటవీ ప్రాంతంలో ఆడపులి కదలికలు కనిపించాయి. దీంతో అటవీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒడిషా నుంచి వచ్చిన పులుల కదలికలపై కొనసాగుతుంది ఫారెస్ట్ వాచ్.. ఈ ఏడాది ప్రారంభంలో ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలో ప్రవేశించిన పెద్ద పులులు ఎంత అలజడి కలిగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే ఏపీలో పులుల సంఖ్య భారీగా పెరిగిందని అటవీ శాఖ అధికారుల అంచనా.
టీడీపీతో పొత్తుపై తెలంగాణ బీజేపీ క్లారిటీ

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ హైకమాండ్ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్‌లను నియమించింది. తెలంగాణలో బీజేపీ సీనియర్లను సైతం పాలక్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. తాజాగా నేడు నిర్వహించిన బీజేపీ సమావేశంలో టీడీపీ పొత్తుపై హాట్‌హాట్ చర్చ జరిగింది. టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు మాజీ ఎంపీ విజయశాంతి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ పొత్తుతో హస్తం పార్టీ నష్టపోయిందని విజయశాంతి తెలిపారు. అయితే.. విజయశాంతి కొరిన విధంగా టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని ఎంపీ అర్వింద్ కూడా కోరారు. అయితే.. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ స్పందిస్తూ.. తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. కార్యకర్తలకు ఈ విషయాన్ని చెప్పండని సూచించారు.
ఆర్టీసీ వివాదాస్పద నిర్ణయం.. వారికే అవకాశం

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది తిరుమలకు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమల కిక్కిరిసిపోనుంది.. అయితే, ఈ సమయంలో.. ఏపీఎస్‌ఆర్టీసీ, తిరుపతి విభాగం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ద్వారం తెరిచి ఉంచే 10 రోజులపాటు దర్శన టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడం రచ్చగా మారుతోంది.. ఆర్టీసీ నిర్ణయంపై వెంకన్న భక్తులు మండిపడుతున్నారు.. అసలు, శ్రీవారి దర్శనానికి, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధం ఏంటి? అని మండిపడుతున్నారు శ్రీవారి భక్తులు. అయితే, వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యల్లో తరలివచ్చే అవకాశం ఉండడంతో.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ఓవైపు ప్రత్యేక దర్శనం టికెట్లు.. మరోవైపు సర్వదర్శనం టోకెన్లు.. ఇలా భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్లాన్ వేసింది.. సామాన్యుల భక్తులకు పెద్దపీట వేస్తామని చెబుతున్నారు టీటీడీ అధికారులు.. ఇదే సమయంలో.. టికెట్లు, టోకెన్లు ఉంటేనే తిరుమలకు రావాలని స్పష్టం చేశారు. ఈ తరుణంలో.. ఆర్టీసీ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలకు పుతిన్ న్యూఇయర్ విషెస్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర సందేశంతో పాటు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని.. ఇంధనం, సైనిక సాంతకేతికత, ఇతర రంగాల్లో పెద్ద ఎత్తున వాణిజ్యం, ఆర్థిక ప్రాజెక్టులను నిర్వహించాలని కోరారు. జీ20, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) అధ్యక్షత బాధ్యతలను భారత్ తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు పుతిన్. ఈ రెండు రష్యా-భారత్ ల మధ్య సహకారాన్ని మరింతగా నిర్మించడానికి కొత్త అవకాశాలను తెరుస్తాయని ఆకాంక్షించారు. 2022లో రష్యా, భారత్ 75 ఏళ్ల తమ దౌత్య సంబంధాల వార్షికోత్సవాలను జరుపుకున్నాయని.. స్నేహం, పరస్పర గౌరవాలపై రెండు దేశాల సంబంధాలు ఆధారపడ్డాయని అన్నారు.
కాంగ్రెస్ లో చేరికపై గులాం నబీ ఆజాద్ క్లారిటీ
కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. అందులో ఉన్న పొరపాట్లను అధిష్టానానికి ఎత్తిచూపుతూ వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్.. ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్‌లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ క్రమంలో గులాంనబీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.. ఇదే సమయంలో.. ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన కొన్ని సందర్భాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.. ఇటీవల గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ.. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలదు అని వ్యాఖ్యానించారు. అంటే, పార్టీని బలహీనపరుస్తున్న అంశాలపైనే తప్ప, కాంగ్రెస్ సిద్ధాంతాలపై ఆయనకు ఎలాంటి వ్యతిరేక లేదు అనేది స్పష్టమైంది..
రిషబ్ పంత్‌ను రక్షించిన డ్రైవర్, కండక్టర్లకు సత్కారం

భయంకరమైన కారు ప్రమాదం నుంచి స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడ్డారు. అతడిని కాపాడి హీరోలుగా నిలిచారు బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ పరంజీత్. వీరిద్దరే లేకుంటే రిషబ్ పంత్ ప్రాణాలతో ఉండే వారు కాదని తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ ను కాపాడిని వీరిద్దరు అసలైన హీరోలుగా నిలిచారు. తాజాగా హర్యానా రోడ్ వేస్ శుక్రవారం వీరిద్దరిని సన్మానించింది. రాష్ట్రప్రభుత్వం కూడా వీరిద్దరిని గౌరవించే అవకాశం ఉందని తెలుస్తోంది. హర్యానా ఆర్టీసీ తరుపున వీరిద్దరిని అధికారులు సత్కరించారు. హర్యానా రోడ్‌వేస్ పానిపట్ డిపో జనరల్ మేనేజర్ కుల్దీప్ జంగ్రా వారికి ప్రశంసాపత్రం, షీల్డ్ అందించారు. డ్రైవర్, కండాక్టర్లు మానవత్వానికి ఉదాహరణగా నిలిచారని జాంగ్రా అన్నారు. హరిద్వార్ నుంచి ఉదయం 4.20 గంటలకు పానిపట్ కు బయలుదేరిన గంటలకు రిషబ్ పంత్ కార్ ప్రమాదానికి గురైన స్థలానికి చేరుకుంది. ఆ సమయంలో సహాయం చేయడానికి వీరద్దరు పరిగెత్తుకుంటూ కారు వద్దకు వెళ్లి, పంత్ ను కారు నుంచి బయటకు తీశారు.