Chandrababu Naidu: నా ప్రాణాలు అడ్డుపెట్టైనా పార్టీ కోసం పనిచేసేవారిని కాపాడుకుంటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ కోసం పని చేసేవారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కందుకూరు బహిరంగ సభలో జరిగిన దురదృష్టకరమైన ఘటనపై స్పందిస్తూ.. కందుకూరు సభకు వేలాది మంది ప్రజలు వచ్చారు.. కానీ, మాజీ ముఖ్యమంత్రిగా నేను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదు.. పోలీసులు ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు.. అందుకే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని మండిపడ్డారు.. కందుకూరులో నేను సభ పెట్టిన ప్రాంతంలో గతంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్, వైఎస్ జగన్, సినీ నటులు కూడా బహిరంగ సభలు పెట్టారని గుర్తుచేశారు.. అయితే, ప్రమాదానికి ముందే పోలీసులను హెచ్చరించినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు.
Read Also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో జనవరిలో విశేష పర్వదినాలు ఇవే..
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
మరోవైపు, కందుకూరులో మృతులకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించామని గుర్తుచేశారు చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తర్వాత రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ స్పందించారని విమర్శించారు.. 8 మంది టీడీపీ కార్యకర్తల్ని కోల్పోయి బాధలో ఉంటే.. పుండుమీద కారం చల్లినట్టు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. పార్టీ కోసం పని చేసే వారిని నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని వెల్లడించారు.. ఇక, హుదూద్ తుఫాన్ సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చేశామని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.. 10 రోజులు విశాఖలోనే ఉండి బాధ్యతగా పనిచేశానన్న ఆయన.. రాజేశ్వరి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 28వ తేదీన నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో అపశృతి చోటు చేసుకున్న విషయం విదితమే.. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.. ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!