మా విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు అని చెప్పుకొచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్... తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటకు వెళ్తే భూములకు ధర ఎక్కడుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలని కూడా ప్రజలు నమ్మరని సూచించారు .
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో చేసిన ఎంఓయూలను గ్రౌండ్ చేశాం.. రికార్డు సమయంలో గోద్రెజ్ సంస్థను ఏర్పాటు చేశాం అన్నారు మంత్రి అమర్నాథ్.. ప్రభుత్వం వేగంగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని గుర్తుచేసుకున్న ఆయన.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుంది.. ఏపీకి గతంలో ఎన్నడూ రాని పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని తెలిపారు.
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని మండిపడ్డారు.. చంద్రబాబు అండ్ కో రహిత రాజకీయలతోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆయన.. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో స్నేహం చేసిన కారణంగా అతని మతి కూడా పోయింది.. ఇప్పుడు పవన్…
ఆంధ్రప్రదేశ్‌కు క్రమంగా కంపెనీలు క్యూ కడుతున్నాయి.. మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి.. ఈ రోజు ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..! అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. మరోరోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు.. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతూన్నాడో అర్థం కాదు అంటూ పవన్ పై సెటైర్లు వేశారు.