పవన్‌పై మహిళా కమిషన్ సీరియస్, నోటీసులు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. పవన్ కల్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని.. క్షమాపణలు చెప్పాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వాలంటీర్లు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్.. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక, మహిళలను ఉద్ధేశించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. మహిళా సంఘాలు, వాలంటీర్లు ఈమెయిల్స్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు.. అందుకే ఈ వ్యవహారంలో పవన్‌కు నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు వాసిరెడ్డి పద్మ.. వాలంటీర్లపై విషం కక్కుతున్నారని, అసలు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు.. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేసిన ఆమె.. పవన్ చెప్తున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని సవాల్ చేవారు.. అసలు, యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని ఆరోపించారు వాసిరెడ్డి పద్మ.
జగన్‌పై ద్వేషం.. బాబుపై ప్రేమ.. పవన్ మాటల్లో అది స్పష్టం..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.. పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇక, జనసేనానిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి పేర్నినాని.. ఆట విడుపుగానే పవన్ జనసేన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారని ఎద్దేవా చేసిన ఆయన.. పవన్ ఏలూరు సభలో తన మాటలకు విషం కలిపి మాట్లాడారని మండిపడ్డారు. జగన్‌పై ద్వేషం.. చంద్రబాబుపై ప్రేమ.. పవన్ మాటల్లో కన్పించిందని విమర్శించారు.. 30 వేల మంది ఒంటరి మహిళలు అదృశ్యమయ్యారని.. ఈ లెక్కలు NCB.. పవన్ నుంచి వచ్చిందని చెప్పారు. NCRB లెక్కలైతే పవన్ కరెక్టుగానే చెప్పాడు.. కానీ, NCB లెక్కల కాబట్టే ఈ కామెంట్లు చేశాడని ఫైర్ అయ్యారు. ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా పవన్ విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్నినాని.. ప్రేమ వ్యవహరంలో ఇంట్లో వాళ్ల మీద అలిగి ఇళ్ల నుంచి వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. దీనిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారు. చంద్రబాబు హయాంలో 16 వేలకు పైగా మహిళలు మిస్ అయినట్టు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని NCRB లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడు తప్పుడు లెక్కలు.. విషపు మాటలతో పవన్ సభలు పెడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఏం మాట్లాడమంటే అదే మాట్లాడుతున్నారు. జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్లు.. సచివాలయ వ్యవస్థ అంటే చంద్రబాబుకు, పవన్‌కు వణుకు అని విమర్శించారు. జగన్‌పై ఎన్నో తప్పుడు కేసులు పెట్టినా ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అక్కసు, ఆక్రోశంతో వాలంటీర్లను చెడ్డవాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పవన్ నాలుకకు నరం లేదు.. నోటికి శుద్ధి లేదని ఫైర్ అయ్యారు.. వలంటీర్లు వ్యవస్థను రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతామని చంద్రబాబు, పవన్‌లు చెప్పగలరా..?దమ్ముంటే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టగలరా..? అని చాలెంజ్ చేశారు మాజీ మంత్రి పేర్నినాని.
పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బొత్స.. ఇలాంటి వాళ్లకి అధికారం కావాలట..!
మంత్రి బొత్స సత్యనారాయణ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. విజయనగరం జిల్లా వేపాడ మండలం వల్లంపూడి గ్రామంలో సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సభా వేదికపై నుంచి ఖండించారు.. మైక్ ఉందని మాట్లాడేకూడదు.. స్వార్థం కోసం నీతిమాలిన రాజకీయాలు చేసిన వారికి పగ్గాలు అప్పజెప్పాలా? లేదా ప్రజా సంక్షేమం కోరి ఎన్నో పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పాలా మీరే చెప్పండి? అంటూ ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బొత్స.. వాలంటీర్లు అంటే.. పనికిమాలిన వాళ్లా..? ఎంత హీనంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ పిల్లలొచ్చి పనికిమాలిన వాళ్లా..? వాళ్లకి టాలెంట్ లేదా? ఏంటి దౌర్భగ్యలా ఈ భాషా అంటూ ఫైర్ అయ్యారు. వ్యవస్థలను కాపాడాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే.. ఏంటిది? అని ఆవేదన వ్యక్తం చేశారు. మైకుందని పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా? అని నిలదీసిన ఆయన.. యూజ్ లెస్ మాటలు మాట్లడడానికి.. పని చేసివవాళ్లని చెడగొట్టటానికేనా..? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం ఇలా మాట్లాడడం సరైందా..? ఇలాంటి వాళ్లకి అధికారం కావాలంట.. ఇదేం దౌర్భాగ్యాం మనికి.. అంటూ విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మరోవైపు మహిళా సంఘాలకు పడాల్సిన ఆసరా డబ్బులు ఇంతవరకు పడలేదని వెలుగు ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తాం
కరీంనగర్ జిల్లా గంగధర మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోయిన సంవత్సరము అసెంబ్లీ సాక్షిగా 1,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన కేటీఆర్ ఇప్పటివరకు 8000 ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎటు చూసినా కాలువలే కానీ పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేకపోతున్నారని, కొడిమ్యాల పోతారం చెరువును పూర్తి చేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు 35000 మాత్రమే రుణమాఫీ అయినాయని ఆయన మండిపడ్డారు. దళితులకు దళిత బందు ఇస్తానని చెప్పి అరిగిపోయిన రికార్డు మళ్లీ వేసినట్లు ఇప్పటికి 17 వేల కోట్లు కేటాయించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఫిర్యాదు చేయడానికి వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతిలో ఆర్థికంగా మోస పోయామని ఆరిజన్ డైరీ బాధితురాలు శేజల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సెంట్రల్ ఉమెన్ కమిషన్ కు గతంలో ఫిర్యాదు చేశానని, నాకు జరిగిన అన్యాయం పై వివరిస్తూ ఫిర్యాదు చేశానని తెలిపారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్. ఇవాళ ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ.. కమిషన్ తాను నివాసం ఉండే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమన్నారు. సంబంధిత పోలీస్ సిబ్బందికి తాము చెబుతామని చెప్పారని, కమిషన్ ఆదేశాలతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు వచ్చాననన్నారు. నాకు జరిగిన అన్యాయం పై ఫిర్యాదు చేయడానికి వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదన్నారు. గత వారం రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానని, ఏదో ఒక కారణం చెబుతున్నారు స్టేషన్ సిబ్బంది అని ఆమె మండిపడ్డారు. సెంట్రల్ ఉమెన్ కమిషన్ చెప్పిన రాయదుర్గం పోలీసులు కంప్లైంట్ తీసుకోవడం లేదని, నా పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్నారు. నా క్యారెక్టర్ ను దిగజార్చారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేను ఒక యువతిని ఎన్నిసార్లని స్టేషన్ చుట్టూ తిరగాలని ఆమె ప్రశ్నించారు.
పూల సాగుతో లాభాలెన్నో.. తక్కువ శ్రమ, ఎక్కువ డబ్బులు..!
రైతులు ఇప్పుడు సాంప్రదాయ పంటల కంటే పూల సాగుపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పూల సాగు చేస్తున్నారు. కొందరు బంతిపూల సాగు చేస్తుండగా.. మరికొందరు గులాబీ, చంపా, మల్లె, పొద్దుతిరుగుడు పూల సాగు చేస్తున్నారు. ఈ పూల సాగు ప్రారంభించిన అనతికాలంలోనే పాలము రైతుల జీవితాలు మారినట్లు తెలుపుతున్నారు. అంతేకాకుండా వారి ఆదాయం గతంలో కంటే మెరుగ్గా అయిందని అంటున్నారు. అంతేకాకుండా పూలను సాగు చేయడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు. పాలము జిల్లాలోని గర్వా మరియు లతేహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద సంఖ్యలో రైతులు పూల సాగు చేస్తున్నారు. ఈ రైతులు పండించిన పూలను పాలమూళ్లలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ విక్రయిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత రైతులకు గుర్తింపు వచ్చింది. మరోవైపు అక్కడి ప్రాంతంలోని 459 మంది రైతులకు పూల సాగు కోసం ఉద్యానవన శాఖ మొక్కలు పంపిణీ చేసింది. పాలములోని బసరియా కాల, సాలాతువా, కంకారి, బందువ పంచాయతీల్లో 130 మంది రైతులు పూల సాగు చేస్తున్నారు. ఈ రైతుల్లో మహిళల సంఖ్య కూడా బాగానే ఉంది. కొందరు మహిళా రైతులు చిన్న చిన్న పాచెస్‌లో పూలను పెంచుతున్నారు. దీంతో మహిళా రైతుల భవితవ్యం మారిపోయింది.
విమానంలో విండో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న ప్రయాణికులు..
గత కొంతకాలంగా విమనాల్లో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. దీంతో జనాలు విమానాల్లో ప్రయానించాలంటే వణికిపోతున్నారు..ఇప్పటి వరకు సాధారణ బస్సులు లేదా రైళ్ల జనరల్ కోచ్‌లలో ప్రయాణికులు కొట్టుకోవడం,గొడవపడటం చూశాం. అయితే విమానంలో కిటికీ కోసం ప్రయాణికులు గొడవపడడం ఎప్పుడైనా చూశారా? తాజాగా మాల్టా నుంచి లండన్ వెళ్తున్న ర్యాన్ ఎయిర్ విమానంలో ప్రయాణికులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.. కిటికీ సీటు కోసం ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా కొట్టుకున్నారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ర్యాన్ ఎయిర్ విమానం మాల్టా నుంచి లండన్ వైపు వెళ్తుంది.. ప్రయాణికులు విమానంలోకి చేరుకుంటున్నారు. విమానంలో నడవ సీటు ఉన్న ప్రయాణీకుడు ముందుగా వచ్చి తన సీటులో కూర్చున్నాడు. అయితే అతడి పక్కన ఉన్న విండో సీటు సీటులో కూర్చునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించాడు. అయితే నడవ సీటులో కూర్చున్న వ్యక్తి విండో సీటు ప్రయాణికుడిని కిటికీ వైపుకి వెళ్లడానికి అనుమతించలేదని చెబుతున్నారు. దీని గురించే ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. కొద్దిసేపటికే ఈ సీటింగ్ ఏర్పాటుపై వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ముందుగా కొంత మంది ప్రయాణికులు వారిద్దరినీ శాంతింపజేసేందుకు ముందుకు వచ్చారు. వీళ్ళ గొడవ తగ్గక పోవడంతో సిబ్బంది కూడా వచ్చి సర్ది చెప్పారు..
ఇక్కడ ఏ గొట్టంగాడికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..
బ్రో సినిమాకు మాత్రం అభిమానులు థమన్ పై మరో నిందను వేశారు. థమన్.. క్రికెట్ పై చూపే శ్రద్ద మ్యూజిక్ పై చూపించడం లేదని చెప్పుకొచ్చారు. మొదటినుంచి కూడా థమన్ కు క్రికెట్ అంటే పిచ్చి. స్టేడియంలోకి దిగాడంటే సచిన్ లా దుమ్ముదులిపేయాల్సిందే. నిత్యం క్రికెట్ పిచ్చిలో పడి మ్యూజిక్ ను పక్కన పడేశాడని, అందుకే ఇంత చెత్త ట్యూన్స్ ను ఇస్తున్నాడని ట్రోలర్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే తాజాగా ఈ ట్రోల్స్ పై థమన్ స్పందించాడు. “నేను మందు కొట్టను, నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు.. ఎలాంటి వ్యాపకాలు లేవు.. నాకున్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. రాత్రి 9 గంటలకు.. అందరూ పడుకున్నప్పుడు వెళ్లి క్రికెట్ ఆడటం. మా టీమ్ మొత్తం 22 మంది ఉన్నాం.. మా టీమ్ పేరు థమన్ హిట్టర్స్. సాఫ్ట్ వేర్ కంపెనీస్ తో కానీ, పోలీస్ కమీషనర్ టీమ్స్ తో కానీ ఆడుతూ ఉంటాం. మేము రోజు రాత్రి మ్యాచ్ ఆడుతాం. ఇది నా ఎక్సర్ సైజ్.. నా ఎమోషన్. ఇది ఎవడికి నేను జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు చెప్పుకోవాలి. నా పని వదిలేసి నేను వెళ్లడం లేదు. రోజూ రాత్రి 9 గంటలకు మ్యాచ్ కు వెళ్లి 2 గంటలకు ఇంటికి వచ్చి, చక్కగా వేడినీళ్లతో స్నానం చేసి పడుకుంటాను. ఇది నా హెల్త్ కు ముఖ్యం.. నా స్ట్రెస్ బస్టర్. దీన్ని కూడా తప్పుగా చూస్తుంటే నాకు బాధగా ఉంది. తెల్సినవాళ్ళే ఇలా తప్పుగా రాస్తున్నారు.. అది చాలా బాధగా ఉంది. ఇదిగో థమన్.. నువ్వు పని ఆపేశావ్ అని ఇంతవరకు నాపై ఒక్క డైరెక్టర్ కంప్లైంట్ చేయలేదు.. ఒక్క నిర్మాత కూడా నాపై కంప్లైంట్ చేయలేదు.. నేను మ్యూజిక్ పై ఎంత శ్రద్ద పెడతాను.. నాకొచ్చే రెమ్యూనిరేషన్ లో ఎంత ఖర్చు పెడతాను అనేది వారికి కూడా తెలుసు. ఇక్కడ, నేను ఏ గొట్టం నా కొడుక్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనేది నా ఎమోషన్.. ఒకడు మందు కొడతాడు.. ఇంకొకడు డ్యాన్స్ చేస్తాడు.. అలాగే నేను క్రికెట్ ఆడతాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఏ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
టామ్ క్రూజ్ తో శృంగారం.. చాలా చెత్తగా ఉంది
సినిమా రంగంలో హీరో హీరోయిన్ల మధ్య కొద్దిగా రొమాన్స్ హద్దు దాటితే బయట కూడా వారి మధ్య ఏదో ఉందని చెప్పుకొస్తారు. ఇలాంటి రూమర్లు ప్రతి హీరోయిన్ ఎదుర్కొనేదే. దానికి భాషతో సంబంధం లేదు. హాలీవుడ్ లో కూడా ఇలాంటి రూమర్స్ కు కొదువే లేదు. ఒక హీరోయిన్.. తనకన్నా ఏజ్ లో పెద్ద అయినా హీరోతో రొమాన్స్ చేస్తే .. బయట కూడా శృంగారంలో పాల్గొంటుంది అని పుకార్లు పుట్టించేస్తున్నారు. ఇది అన్యాయం అని అమెరికన్ నటి హేలీ అట్వెల్ వాపోయింది. మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకానింగ్ పార్ట్ 1 లో యాక్షన్ హీరో టామ్ క్రూజ్ సరసన ఈ చిన్నది కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ లో హేలీ, టామ్ క్రూజ్ మధ్య రొమాన్స్ చాలా ఘాటుగా నడిచింది. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు పుట్టుకొచ్చాయి. వీరు రిలేషన్ లో ఉన్నారని గత కొన్నిరోజులుగా హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ పుకార్లపై తాజాగా హేలీ స్పందించింది. ఇలాంటి పుకార్లు పుట్టించినవాళ్లకు సిగ్గులేదు అంటూ ఫైర్ అయ్యింది. ” నా వయస్సు 41 .. టామ్ క్రూజ్ వయస్సు 61. మేము ఇద్దరం శృంగారంలో పాల్గొనడం ఏంటీ..? అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు. ఈ వార్తనే చాలా చెత్తగా ఉంది. అంత డర్టీగా ఎలా ఆలోచించగలుగుతున్నారు. ఆయన నాకు అంకుల్ లాంటి వారు. ఆయనకూడా నన్నెప్పుడూ చేదు ఉద్దేశ్యంతో చూడలేదు. ఆయనతో ఇలా శృంగారం చేశాను అని చెప్పుకొస్తున్నారు సిగ్గుగా లేదా.. ?. నటిని కాబట్టి స్క్రీన్ మీద మాత్రమే మా మధ్య రొమాన్స్ జరిగింది. అయినా నాకు సింగర్ కెల్లీతో ఎంగేజ్మెంట్ అయ్యింది. త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది. ఇంతటితో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
శారీలో హాట్ అందాలతో కైపేక్కిస్తున్న జాన్వీ కపూర్..
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది.. మొదటి సినిమానే ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని అందుకుంది..ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్న విషయం తెలిసిందే..శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్ వెండితెరకు పరిచయం అయ్యింది. బాలీవుడ్ లో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సినిమాల పరంగా గతంలో జోరు లేకున్నా క్రేజ్ పెంచుకుంటూనే వచ్చింది. ప్రస్తుతం జాన్వీ వరుస హిందీలో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది… ప్రస్తుతం జాన్వీ నాలుగు చిత్రాల్లో నటించింది. అవి విడుదల కావాల్సి ఉన్నాయి. హిందీలో ‘ఉలజ్’ సినిమాలు చిత్రీకరణలో ఉండగా.. మరో రెండు సినిమాలు ‘బావల్’, ‘మిస్టర్ అండ్ మిస్ మహి’ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. ఇక ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే సౌత్ ఆడియెన్స్ ను పలకరించనుంది. ఎప్పటినుంచో ఆడియెన్స్ కూడా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. వచ్చే ఏడాది ఆ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది..