రాజకీయ స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తిని కాదు.. జనసేన ప్రభుత్వంలో ముస్లింల జీవన ప్రమాణస్థాయిని పెంచుతామని హామీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా జనసేన చూసుకుంటుంది అని కాకినాడలో జరిగిన ముస్లిం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో స్పష్టం చేశారు..
హరి రామ జోగయ్య లేఖ ద్వారా ముద్రగడకు కౌంట్ ఇచ్చారు.. వారాహి యాత్ర ద్వారా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్‌ని అనుసరించాలని కాపు సంక్షేమ సేన ఆశిస్తుందన్న ఆయన.. చిన్న మంత్రి పదవులు ఆశించి.. రెడ్డి కులాధిపతికి కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్న నాయకులను చూసి మోసపోకండి అని పిలుపునిచ్చారు.
ఎండల నుంచి ఉపశమనం లభిస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.. మంగళవారం నాటికి నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు విస్తరించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డా. బీఆర్ అంబేద్కర్ తెలిపారు
AP High Court: లింగమనేని రమేష్ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. తమ వాదనలు వినిపించటానికి అవకాశం లేదని తీర్పు ఇచ్చిన కింది కోర్టు తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు లింగమనేని రమేష్ న్యాయవాది.. అయితే, స్టే ఇవ్వటానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది.. అంతే కాదు.. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది..…
ముద్రగడ లేఖను పవన్ కల్యాణ్ చదివితే వెంటనే ఏపీ నుంచి పారిపోతారని పేర్కొన్నారు మంత్రి జోగి రమేష్.. ముద్రగడ విలువలు ఉన్న వారు గనుక విలువల గల లేఖ రాశారని చెప్పుకొచ్చారు.. పవన్ కల్యాణ్‌కి సినిమాలు, కాల్ షీట్లు లేవు.. అందుకే ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్లో యాక్షన్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.. దీనికి కో డైరెక్టర్ నాదెండ్ల మనోహర్ అని సెటైర్లు వేశారు.
సినిమాటిక్ యాత్ర లా పవన్ హావ భావాలు ఉన్నాయన్నారు.. అభిమానులను అలరించడానికి ఈ యాత్ర చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు