Kakani Govardhan Reddy: తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో.. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవడం, మళ్లీ సీఎం అవ్వడం అంతే నిజం అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగా తేలిపోయింది.. అందుకే ఫ్రస్టేషన్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ గురించి అవమానకరంగా మాట్లాడుతున్నాడు.. 70 శాతం మహిళలు ఉన్న వాలంటీర్ ల మనోభావాలను గాయపరుస్తున్నాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పవన్ కొనసాగలేడు, ప్రజలు పవన్ ను స్వాగతించరన్న ఆయన.. పవన్ నాలుగు చోట్ల పోటీ చేసినా నువ్వు గెలవలేవు అంటూ జోస్యం చెప్పారు.
Read Also: TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో 19 మంది అరెస్ట్..
పవన్ మనస్తత్వం తెలుసు కాబట్టి.. పవన్ పేరు కూడా సీఎం వైఎస్ జగన్ ఉచ్చరించరన్నారు మంత్రి కాకాని.. పవన్ ప్యాకేజీలకు అమ్ముడు పోయే వ్యక్తి .. అందుకే సీఎం జగన్.. పవన్ కల్యాణ్‌ను దత్తపుత్రుడు అనేది అంటూ సెటైర్లు వేశారు. ఇక, మహిళా భద్రత గురించి పవన్ మాట్లాడటం బాధాకరం అన్నారు కాకాని.. పవన్ వల్ల విదేశీ మహిళల భద్రత గురించి కూడా ఆలోచించాలి.. పవన్ ఎన్ని పెళ్లి చేసుకుంటాడో ఎవరికీ తెలియదంటూ హాట్ కామెంట్లు చేశారు. మరోవైపు, పాదయాత్ర చేస్తున్న లోకేష్ కు తెలియకుండానే చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశాడు.. అది పార్టీలో లోకేష్ పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి.