చంద్రబాబు అనే శని పవన్ నెత్తిమీద ఉంది.. అందుకే అలా..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతూనే ఉన్నాయి.. పవన్ కామెంట్లపై మరోసారి మండిపడ్డారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కట్యాణ్ మాటలు పిచ్చివాడిలా ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు అనే శనిగాడు పవన్ నెత్తిమీద ఉన్నాడు.. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. వాలంటీర్లు మన పిల్లలే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు .. మన ఇంట్లో వాళ్లే వలంటీర్లు అయ్యారు.. అన్ని ప్రామాణికలు పాటించిన తర్వాతే వాలంటీర్ ఎంపిక జరిగిందన్నారు కొట్టు సత్యనారాయణ. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ప్రకారమే వాలంటీర్ ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. పవన్ మాటలు పిచ్చివాడిలా ఉన్నాయి. చంద్రబాబు అనే శనిగాడు పవన్ నెత్తిమీద ఉన్నాడు.. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ..
వారికి ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇక, రూ.10 వేలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు శుభవార్త చెప్పింది.. ఇక, పది వేల లోపు ఉన్న అర్చకులకు 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని వెల్లడించారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. అర్చకులకు న్యాయం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఇక, టెంపుల్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. మరోవైపు, టెంపుల్స్‌లో సాంకేతిక సిబ్బంది కొరత ఉందని అంగీకరించారు.. అయితే, ఆ కొతరను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
మంత్రి విడదల రజనీకి అస్వస్థత.. వెంటనే బెజవాడకు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు మంత్రి.. అయితే, ఇదే సమయంలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో, అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే ఆమెకు వోఆర్ఎస్ ఇచ్చారు. అనంతరం కాసేపు అక్కడే ఉన్న ఆమె.. కాసేపటి తర్వాత సమావేశాన్ని ముగించుకొని వెంటనే విజయవాడకు బయల్దేరారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చింది.. ఓవైపు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెబుతున్నా.. మరోవైపు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తీరిక లేకుండా గడుపుతున్నారు.. సీఎం వైఎస్ జగన్ నుంచి కొందరు వెనుకబడిన ప్రజాప్రతినిధులు తప్పితే.. మిగతా వాళ్లంతా.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. మరోవైపు పార్టీ కార్యక్రమాలు, గడపగపకు మన ప్రభుత్వం, ఇతర ఫంక్షన్లు ఇలా తీరిక లేకుండా గడిపేస్తున్నారు.. బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
యాక్టింగ్ కాదు.. నిజ జీవితం గొప్ప.. వాలంటీర్లను విమర్శించాడంటేనే స్థాయి తెలిసిపోయింది..!
వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఓవైపు వాలంటీర్లు, మరోవైపు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పవన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. పరోక్షంగా జనసేనానిని టార్గెట్ చేశారు.. రాత్రి అనక , పగలనక వాలంటీర్లుగా పని చేసిన వారిని విమర్శిస్తున్నారు అంటూ మండిపడ్డారు.. బాధ్యత లేక వారు వాలంటీర్లపై మాట్లాడుతున్నారు.. ఎవరో బ్రోకర్ వెదవ అన్నాడని, పనికి మాలినోడి మాటల్ని పట్టించుకోవద్దు అని సూచించారు. సమాజంలో వేస్ట్ టికెట్లు, చీడ పురుగులు తిరుగుతూ ఉంటారు.. మంచి పని చేసేవారికి పోరంబోకులు తగులుతుంటారని మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. నిన్నో పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.. వారికేటి తెలిదు అంటూ ఎద్దేవా చేశారు.. నాలుగు గోడల మధ్య సినిమాలు తీసేవాడు గొప్పగా ఫీలవుతూ ఉంటారు.. యాక్షన్‌లు చేయడం గొప్పకాదు.. నిజ జీవితం గొప్ప అని హితబోధచేశారు. ఓ వాలంటీర్లు విమర్శిస్తే ఆయన స్థాయి ఏంటో మనకి అర్థం అవుతుంది అంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు.. అలాంటి వారిని విమర్శించడం నా స్థాయికి తగదు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో ఉంది
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావాలని, అందుకు నేతలంతా శ్రమించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని, బీఆర్ఎస్ పై పోరాటానికి హైకమాండ్ కూడా పలు గైడ్ లైన్స్ ఇచ్చిందన్నారు కిషన్ రెడ్డి. వరంగల్ లో ప్రధాని మోడీ సైతం బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడారని, వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది బీఆర్ఎస్ పై పోరాటానికే అని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలకు దిగుతున్నాయన్నారు. దీన్ని నేతలంతా ధీటుగా ఎదుర్కోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేసిందన్నారు కిషన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో ఉందని, వేల కోట్ల రూపాయలను బీఆర్‌ఎస్ పార్టీ దోచుకుందని ఆయన ఆరోపించారు. ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నారని, ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే నోముల భగత్‌పై జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి హాట్ కామెంట్స్
హలియాలో కాంగ్రెస్ యువజన నాయకుడు, మాజీమంత్రి కందూరు జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి చేపట్టిన గిరిజన చైతన్య యాత్ర ముగింపు సభను పెద్దవూర చింతపల్లి తండాలో కుందూరులో నిర్వహించారు. ఈ సభలో మాజీమంత్రి కుందూరు జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైవీర్ రెడ్డి మాట్లాడుతూ.. మేము ఉప ఎన్నికల సమయంలో గులాబీ కండువా కప్పుకుని ఉంటే… నువ్వు తిరిగి పెట్రోల్ బంకులను చూసుకునే వాడివని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పై మండిపడ్డారు జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి. గత కొద్ది రోజులుగా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జైవీర్ రెడ్డి రెండో విడత పాదయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే లక్ష్యంగా విమర్శలు సంధించారు. మొదటి విడత పాదయాత్ర గిరిజన తండాల లో సాగగా 14 రోజులు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, రాజకీయ విమర్శలకు చోటు ఇవ్వకుండా పాదయాత్ర పూర్తి చేయగా…. రెండో విడత పాదయాత్రలో ఎమ్మెల్యే లక్ష్యంగా, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం లో అవకతవకలపై విమర్శలు చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు.
పాకిస్థాన్ తో టీమిండియా ఆడితే ఓడిపోతుంది.. అందుకే సిరీస్ లు ఆడడం లేదు..
వన్డే ప్రపంచకప్ 2023 మెగా ఈవెంట్ కోసం 2016 తర్వాత దాయాది పాకిస్థాన్ టీమ్ 7 సంవత్సరాల తర్వాత భారత్ లో అడుగుపెట్టబోతుంది. అయితే ఈ విషయంపై పాకిస్థాన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా ఆడే మ్యాచ్ లన్నీ తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆడే మ్యాచ్ లన్నీ కూడా తటస్థ వేదికపై నిర్వహించాలని ముందు నుంచి పాక్ క్రికెట్ బోర్డు పట్టుబట్టింది. అయితే.. టీమిండియా ఓడిపోతామనే భయంతోనే పాకిస్తాన్‌తో సిరీస్ ఆడేందుకు ఇష్టపడడం లేదని పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. ‘ఇండియా- పాకిస్తాన్ జట్ల మధ్య మంచి గౌరవం, స్నేహం గతంలో ఉండేవి.. కానీ ఇప్పుడున్న టీముల్లో భారత జట్టు ఒక్కటే, పాకిస్తాన్‌తో సిరీస్‌లు ఆడడం లేదు.. వాళ్లు ఎందుకు ఆడడం లేదో తెలుసా.. పాక్ జట్టు పటిష్టంగా ఉంది.. ఒకవేళ ఆడితే ఓడిపోతామనే భయంతోనే మ్యాచ్ లు ఆడటం లేదని రజాక్ చెప్పాడు. ఇంతకు ముందు కూడా మాతో ఇండియా మ్యాచులు ఆడినప్పుడల్లా ఓడిపోయేవాళ్లు అంటూ వ్యాఖ్యనించాడు.
నేను మంచి కోచ్‌ను అవుతాను.. ఇంతకీ బీసీసీఐ ఛాన్స్ ఇస్తుందా..?
తాజాగా ఓ కార్యక్రమంలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘అవును, నేను టీమిండియాకి మంచి కోచ్‌గా మారగలను.. ఆ నమ్మకం నాకుంది.. అయితే దానికి నేను బీసీసీఐ సిస్టమ్‌లో ఉండాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ అవకాశం వస్తుందన్న నమ్మకం ఏ మాత్రం లేదు.. నేను చేస్తానని చెప్పినా ఆ అవకాశం నాకు ఇవ్వరు’ అంటూ కామెంట్ చేశాడు.
రక్తనమూనాలతో లైంగిక పటుత్వ పరీక్ష.. టూ ఫింగర్ టెస్టును తొలగించండి..
లైంగిక పటుత్వ పరీక్ష(పొటెన్సీ టెస్ట్)కు అనుసరిస్తున్న విధానాల్లో మార్పు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సైన్స్ అభివృద్ధి చెందిందని, వీర్య నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదని, కేవలం నిందితుడి రక్తనమూనాలను ఉపయోగించి పొటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టూ ఫింగర్ టెస్ట్ నిలిపివేయబడుతుందని నిర్ధారించుకోవాల్సి అసవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం, జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్) చట్టం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన న్యాయమూర్తులు ఎన్ ఆనంద్ వెంకటేష్, సుందర్ మోహన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ జూలై 7న ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మైనర్ బాలిక మరియు అబ్బాయికి సంబంధించిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కూడా ధర్మాసనం విచారిస్తున్న క్రమంలో ఈ ఆదేశాలు ఇచ్చింది.
భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్…
టెక్ సంస్థల్లో ఉద్యోగుల లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టెక్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. ఇదిలా ఉంటే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది జనవరిలో 10,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది మైక్రోసాఫ్ట్. వీటికి అదనంగా మరికొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారం నుంచే ఈ తొలగింపులు ప్రారంభించింది. తాజా తొలగింపుల్లో భాగంగా యూఎస్ వాషింగ్టన్ లోని ఆఫీసులో ఉద్యోగులపై ప్రభావం పడింది. ఉద్యోగుల్లో 276 మందిని తొలగించింది. అందులో 66 మంది వర్చువల్ గా పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరిలో సేల్స్, కస్టమర్ సక్సెస్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. తామంతా ఉద్యోగులు కోల్పోయామని లింక్డ్‌ఇన్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా వెల్లడిస్తున్నారు. మాజీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఉద్యోగాల కోసం లింక్డ్‌ఇన్ వెబ్‌సైట్ ద్వారా వెతుకుతున్నారు. తమ క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో ఖర్చులను తగ్గించుకునేందుకు లేఆఫ్స్ తీసుకువచ్చినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించించింది. రానున్న రోజుల్లో మరింత మందిని తొలగిస్తామని సంస్థ ప్రకటించింది. అయితే ఈ సంఖ్యను మాత్రం వెల్లడించలేదు.
టిల్లు గాడు.. చిరంజీవినే రిజెక్ట్ చేశాడా.. ?
సిద్దు జొన్నలగడ్డ.. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా తరువాత సిద్దుకు మంచి ఛాన్స్ లు వచ్చినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు సిద్దు. ఈ సినిమా సిద్దు కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం తరువాత సిద్దు ..టిల్లు స్క్వేర్ అంటూ సీక్వెల్ ప్రకటించాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది. అయితే సిద్దు.. డీజే టిల్లు తరువాత సెకండ్ హీరోగా కానీ, కీలక పాత్రలో కానీ చేయడం మానేశాడు. ఇప్పటికే బుట్టబొమ్మ సినిమాలో సెకండ్ హీరోగా చేయాల్సి ఉండగా.. దాని నుంచి బయటికి వచ్చి అప్పట్లో చాలా వివాదాలనే కొనితెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా చిరంజీవితో చేసే ఛాన్స్ ను కూడా వదులుకున్నాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. మలయాళంలో భారీ హిట్ అందుకున్న బ్రో డాడీకి ఇది రీమేక్ అని సమాచారం. ఇందులో చిరుకు కొడుకుగా సిద్దు నటిస్తున్నాడని వార్తలు వినిపించాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సిద్దు రిజెక్ట్ చేసాడట. టిల్లు స్క్వేర్ షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడం, డేట్స్ అడ్జెస్ట్ లేకపోవడంతో సిద్దు ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో మేకర్స్ మరో కొత్త హీరోకోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. అయితే.. ఈ వార్త తెలియడంతో అభిమానులు.. ఏంటీ .. చిరుతో చేసే అవకాశాన్ని సిద్దు వదులుకున్నాడా.. ? ఎంతమంది ఆయనతో సినిమాచేయాలనీ చూస్తుంటారు.. టిల్లు హిట్ అవ్వడంతో సిద్ధుకు కొంచెం గర్వం ఎక్కువ అయ్యిందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఏంటి అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
దరువు మార్చి కొత్త సౌండ్ వేసారు… అన్నయ్య నీ గ్రేస్ కి హ్యాట్సాఫ్
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘భోళా శంకర్’. ఆగష్టు 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న భోళా శంకర్ మూవీ నుంచి ‘జాం జామ్ జజ్జనక’ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. మంచి వెడ్డింగ్ సాంగ్ గా బయటకి వచ్చిన ఈ పాటలో చిరు డాన్స్ గ్రేస్ చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సింది. సాగర్ మహతి ఇచ్చిన థంపింగ్ ట్యూన్ కి, శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ సూపర్బ్ ఉన్నాయి. మంగ్లీ, అనురాగ్ కులకర్ణి వోకల్స్ సాంగ్ కి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా మారాయి. ముఖ్యంగా కాసర్ల శ్యామ్ లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. వినగానే హమ్ చేసే రేంజులో ‘జాం జామ్ జజ్జనక’ సాంగ్ ఉండడంతో రిపీట్ వాల్యూ పెరిగింది. లావిష్ గా వేసిన సెట్ లో చిరు, తమన్నాలు డాన్స్ వేస్తుంటే మెగా ఫాన్స్ కి థియేటర్ లో ఐ ఫీస్ట్ గ్యారెంటీ. సాంగ్ మధ్యలో “ఛేంజోవర్ కావాలి, బీట్ మార్చు బ్రదర్’ అని చిరు అన్న తర్వాత ‘జాం జామ్ జజ్జనక’ సాంగ్ జోష్ అందుకుంది.