AP and Telangana Elections: ఏపీ, తెలంగాణ ఎన్నికలు..! అప్పుడే బెట్టింగ్‌ల జోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP and Telangana Elections: తెలంగాణ రాజకీయాలపై బెట్టింగ్ రాయుళ్లు.. అప్పుడే పందేలు మొదలుపెట్టారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార బీఆర్ఎస్.. కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ పొలిటికల్ యాక్టివిటీని పెంచేశాయి. తెలంగాణలో ఎన్నికల హీట్ వచ్చేసిందనే టాక్ మొదలైంది. దీంతో పందెం రాయుళ్లు.. తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై బెట్టింగ్ లు కట్టడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లోనే కాదు..ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీగా పందేలు కాస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దీనికి తోడు బిజెపి అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అధికార పార్టీ కూడా టెన్షన్ లోకి వచ్చిందన్న ఫీలింగ్ కనబడుతోందన్న చర్చ జరుగుతోంది. వీటన్నిటితో తెలంగాణలో గెలిచేది ఎవరు అనే అంశంపై బెట్టింగ్ కాస్తున్నారు. అధికార బీఆర్ఎస్ కు 65 సీట్లు వస్తాయని కొందరు బెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పై అనూహ్యంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 45 సీట్లు వస్తాయని కొందరు, 35 నుంచి 40 సీట్లు వస్తాయని మరికొందరు పందెం వేస్తున్నారు. ఎక్కువమంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 40 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని లక్షల్లో బెట్ చేస్తున్నారు. ఇక బీజేపీ 12 సీట్లలోపే పరిమితం అవుతుందని కాయ్ రాజా కాయ్ అంటున్నారు.
Also Read
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
డిసెంబర్‌లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుచే బెట్టింగ్ కాస్తున్నారు. ఇప్పుడు ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగి చూసే ధోరణిలో బెట్టింగ్ కడుతున్నారు. ఎన్నికలకు ఐదారునెల ముందే ఇలాంటి బెట్ కాస్తే… ఎన్నికలు దగ్గర పడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనా బెట్టింగ్ మామూలుగా లేదు. పొత్తులు కుదరలేదు, తెలంగాణతో పోలిస్తే సమయం ఇంకా చాలా వుంది…అయినా ఏపీపైనా ఒక రేంజ్ లో బెట్టింగ్ సాగుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 75 నుంచి 81 సీట్లు వస్తాయని పందెంరాయుళ్లు బెట్టింగ్ కాస్తున్నారు. అలాగే టీడీపీకి 65 నుంచి 70 స్థానాలు వస్తాయని పందెం వేస్తున్నారు. జనసేనకు 15 నుంచి 20 సీట్లు వస్తాయని బెట్టింగ్ కు సై అంటున్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హీట్ పెరగడంతో, బెట్టింగ్ జోరు కూడా మొదలైపోయింది.
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!