Vasireddy Padma: మహిళా కమిషన్‌ను పవన్ కల్యాణ్ గౌరవించడం లేదు.. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులను కూడా లైట్‌గా తీసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మా.. సచివాలయంలో మహిళా కమిషన్ నేతృత్వంలో మహిళల ఆత్మగౌరవ దినోత్సవం నిర్వహించారు.. మహిళలపై సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై చర్చించారు.. మహిళల ఆత్మగౌరవ దినోత్సవానికి మద్దతుగా సచివాలయ మహిళా ఉద్యోగులు సంతకాలు చేవారు.. మహిళా ఆత్మగౌరవ దినాన్ని ప్రతి శుక్రవారం జరుపుకుందాం అనే నిర్ణయానికి వచ్చారు.
Read Also: Boora Narsaiah Goud : కేసీఆర్ బీసీలను అష్ట దిగ్బంధనం చేస్తున్నారు
ఇక, ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. అభివృద్ధి సాధించినా నేటికీ మహిళ పట్ల మధ్యయుగ మనస్తత్వం పోలేదన్నారు. మహిళలను కించ పరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులు మొదలుకొని అందరిపై అసభ్య పోస్టింగ్ లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎవరి పైన అయినా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం తప్పేనన్న ఆమె.. పవన్ కల్యాణ్.. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులను కూడా లైట్ గా తీసుకున్నారని ఫైర్ అయ్యారు.. ఆరోపణలపై ఆధారాలు అడిగాం.. కానీ, మహిళా కమిషన్ ను పవన్ కల్యాణ్ గౌరవించడం లేదని విమర్శించారు. మా మీద కూడా జనసేన కార్యకర్తలు ట్రోల్ చేశారు.. అందుకు జనసేన పార్టీని రద్దు చేస్తారా?.. ఇందుకు పవన్ కల్యాణ్ బాధ్యులు అంటే ఒప్పుకుంటారా ? అని నిలదీశారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మా.