ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే డీఎస్సీ నోటిఫకేషన్ విడుదల కాబోతోంది.. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం జిల్లా రాజాం ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు
సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలని స్పష్టం చేశారు.. దీనిని కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు.. ఇప్పటికే ఇది అమల్లో ఉంది. సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు అవుతుంది అన్నారు.
సునకానందం కోసం కొందరు తనకు అనారోగ్యం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొడాలి నాని.. నేను అనారోగ్యానికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.. టీడీపీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనం, నాకు క్యాన్సర్ అంటూ ఐ-టీడీపీ ద్వారా టీడీపీ ఇలాంటి ప్రచారాలు చేయిస్తోందని దుయ్యబట్టారు.