PV Sindhu: దుబాయ్‌లో నిలిచిపోయిన పీవీ సింధు.. ఎయిర్‌పోర్టులో పుణే విద్యార్థుల పడిగాపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PV Sindhu:మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్య ప్రయాణికులతో పాటు ప్రముఖులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇరాన్ గగనతలాన్ని మూసివేయడం, యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలను అధికారులు రద్దు చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. ప్రతిష్ఠాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-2026’ టోర్నీలో పాల్గొనేందుకు పీవీ సింధు బ్రిటన్ (యూకే) బయలుదేరారు. దుబాయ్ మీదుగా వెళ్లాల్సిన ఆమె విమానం.. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అక్కడే నిలిచిపోయింది. విమానాశ్రయం మూసివేతతో అధికారులు ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో సింధును ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఒక హోటల్‌కు తరలించారు. తాను సురక్షితంగానే ఉన్నానని, ప్రస్తుతం హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నానని సింధు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు సమాచారం అందించారు.
READ ALSO: Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
విమానాశ్రయంలో విద్యార్థుల అవస్థలు..
మరోవైపు, మహారాష్ట్రలోని పుణేకు చెందిన 84 మంది ఎంబీఏ విద్యార్థులు సైతం దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. తమ ఇంటర్నేషనల్ స్టడీ టూర్ ప్రాజెక్ట్ ముగించుకుని స్వదేశానికి బయలుదేరేందుకు నిన్న సాయంత్రమే వారు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విమానాలు రద్దు కావడంతో వారు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్-అమెరికా భీకర పోరు ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయం ఇప్పుడు బోసిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడమే కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. పరిస్థితులు చక్కబడే వరకు ప్రయాణికులు ఎక్కడికక్కడే వేచి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
READ ALSO: Ali Khamenei: ఖమేనీ అంతం.. ఆ 5 కారణాలే ఇరాన్ సుప్రీం లీడర్ ప్రాణం తీశాయా?
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?