Jagananna Videshi Vidya Deevena: విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త.. రేపే వారికి ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagananna Videshi Vidya Deevena: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విద్యార్థులకు మరోసారి శుభవార్త చెప్పారు.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే కాగా.. తద్వారా అర్హులైన విద్యార్థులు విదేశాల నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి, వృత్తిపరమైన, గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేయడానికి వైఎస్ జగన్ సర్కార్ ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇక, రేపు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు సీఎం వైఎస్ జగన్.. అర్హులైన 357 మంది విద్యార్థుల విదేశీ విద్యకు ప్రభుత్వ ఆర్థిక సహాయం చేయనుంది.. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి 45.53 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు సీఎం జగన్.. రేపు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జగనన్న విదేశీ విద్యకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు… ఇక, ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ. 1.25 కోట్ల వరకు ఫీజు రీయింబెర్స్‌మెంట్ చేయనుండగా.. ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయనుంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.
కాగా, రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా వైఎస్ జగన్మోహన్‌ఱెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వైసీపీ సర్కార్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించింది. పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు చేకూరుస్తోంది.. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో సీటు పొంది , PG , PHD లేదా MBBS చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తోంది ప్రభుత్వం.. వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలు. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?