DGP Rajendranath Reddy: కర్నూలు , నంద్యాల జిలాల్లో నేరాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. కర్నూలులో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఆరు నెలల్లో నేరాల శాతం తగ్గిందని వెల్లడించారు. హత్యలు, వరకట్న చావులు 27 శాతం తగ్గాయని.. మహిళలపై నేరాలు కర్నూలు జిల్లాలో 45 శాతం, నంద్యాల జిల్లాలో 65 శాతం తగ్గాయని పేర్కొన్నారు.. ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయని తెలిపారు.. రోడ్డుప్రమాదాలు జరిగే స్పాట్స్, సమయంపై సమీక్షించి రోడ్డు ప్రమాదాలు అరికట్టామన్నారు.. ఎస్సీ, ఎస్టీ , పొక్సో చట్టం కింద కూడా కేసులు తగ్గాయన్న ఆయన.. దిశ యాప్ ద్వారా చాలా వరకు నేరాలు తగ్గుతున్నాయన్నారు.. జైలు శిక్షలు పడేలా దర్యాప్తు చేస్తున్నాం.. రౌడీలపై దృష్టిపెట్టాం, పిడీ యాక్ట్ అమలు చేశామని వెల్లడించారు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.
Read Also: Godavari River: ఉగ్ర గోదావరి.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
కాగా, తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యంపై కేంద్రం ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. ఏపీ, తెలంగాణ…రెండు రాష్ట్రాల్లో కలిపి మూడేళ్లలో 72వేల 767 మంది బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని స్పష్టం చేసింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అదశ్యమైనవారిలో 15వేల 994 మంది బాలికలున్నారని, 56 వేల773 మంది మహిళలున్నారని కేంద్రం స్పష్టం చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఏపీ, తెలంగాణలో బాలికలు, మహిళలు అదృశ్యమవుతున్న కేసులో ఏటా పెరుగుతున్నాయని నివేదికలో ప్రస్తావించారు. ఏపీలో 2019 నుంచి 2021వరకు మూడేళ్లలో 7వేల 928 మంది బాలికలు. .22వేల 278 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఆ మూడేళ్లలో.. తెలంగాణలో 8వేల 66 మంది బాలికలు, 34 వేల 495 మంది మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొన్న విషయం విదితమే.