శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణంలో ప్రమాదం.. ఇద్దరు మృతి
తిరుపతిలోని శ్రీనివాస సేతు ప్లై ఓవర్ పనుల్లో భారీ ప్రమాదం జరిగింది. రిలయన్స్ మార్ట్ వద్ద నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనుల్లో భాగంగా చివరి సిమెంటు సిగ్మెంట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో క్రేన్ వైర్లు తెగిపోవడంతో ఒక్కసారిగా సెగ్మెంట్ కింద పడిపోయింది. అక్కడే ఇద్దరు కార్మికులు పనిచేస్తుండటంతో.. వారిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవిజిత్, బీహార్‌కు చెందిన బార్దోమాండల్‌గా గుర్తించారు పోలీసులు. మరోవారంలో ఫ్లై ఓవర్ పనులు పూర్తవుతాయని అనుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ చివరి దశలో ఈ ఘటన జరగటం చాలా బాధాకరం అన్నారు. ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.. కేవలం మూడు సెగ్మెంట్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.. మెకానికల్ ప్రోబ్లం కారణంగా భారీ క్రేన్ కేబుల్ తెగడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.. జరిగిన ఘటన చాలా బాధాకరం, 700 టన్నుల కెపాసిటీ గల భారీ క్రేన్ 70 టన్నుల సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తుండగ కేబుల్ తెగి ప్రమాదం జరిగిందని.. ఇప్పటి వరకు చిన్న సంఘటన కూడా జరగలేదు.. భగవంతుడు దయ వల్ల అంతా మంచి జరిగింది అనుకున్న తరుణంలో ఈ సంఘటన బాధాకరం అన్నారు.. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వం నుంచి సహకారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, మరికొద్ది రోజుల్లో ట్రైల్ రన్ నిర్వహించాలని నిర్ణయించాం, అనుకొని విధంగా ఈ ఘటన జరిగింది, చాలా బాధాకరం అన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.
భాగ్యనగరంలో భారీ వర్షం.. గ్యాప్ లేకుండా దంచికొడుతోన్న వాన..
భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది.. నిన్న రాత్రి నుంచి గ్యాప్ లేకుండా వాన దంచికొడుతూనే ఉంది.. వర్షం పడితే చాలు.. హైదరాబాద్ అస్తవ్యస్తంగా మారిపోతుంటుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్‌ఎంసీ, పోలీసు ఉన్నతాధికారులు.. హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.. ఇక, తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. కొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అతి భారీ వర్షాలు.. నిన్న ఉదయం 8:30 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో వర్షాలు నమోదు అయ్యాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 434 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 10కి పైగా ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్ల నుంచి 500 మిల్లీ మీటర్ల వర్షపాతం.. 50 పైగా ప్రాంతాల్లో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
ప్రియుడి మోజులో పడి భర్తకు స్టెరాయిడ్స్.. కోమాలో బాధితుడు
పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి.. కుటుంబ పోషణ, సంపాదనలో భర్తలు ఉంటే.. కొందరు భార్యలు.. వివాహ వ్యవస్థకు మచ్చ తెస్తూ.. మరొకరి మోజులో పడిపోతున్నారు.. భర్తను, పిల్లలను నిర్లక్ష్యం చేసేవారు కొందరైతే.. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను, పిల్లలను సైతం వదిలించుకోవడానికి వెనుకాడడం లేదు.. తాజాగా, ప్రియుడి మోజులో పడి భర్తకు స్టెరాయిడ్స్ ఇచ్చి చంపేందుకు ప్రయత్నించింది భార్య. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ ఘటన జరిగింది. పుంగనూరులోని కొత్తపేట క్రాస్ రోడ్డులో క్లినిక్ నిర్వహిస్తోంది భార్య ఈశ్వరి. అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు నాగరాజు. తిరుపతి స్విమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అధిక మోతాదులో మెడిసిన్ వాడటం వల్ల కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. భార్య ఈశ్వరి, ప్రియుడు సాజిద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా, ప్రియుడు మోజులో పడి, వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు కొందరు దంపతులు.. ఇటు భార్యలు, అటు భర్తలు కూడా తాత్కాలిక సుఖం కోసం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. సొంతవారు అనే విషయాన్ని మర్చి దారుణాలకు పాల్పడుతున్నారు.. తీరా విషయం బటయపడిన తర్వాత ఊచలు లెక్కపెడుతున్నారు.
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఈ రోజే ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన విషయం విదితమే కాగా.. తద్వారా అర్హులైన విద్యార్థులు విదేశాల నుండి ఉన్నత విద్యను అభ్యసించడానికి, వృత్తిపరమైన, గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేయడానికి వైఎస్ జగన్ సర్కార్ ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఇక, ఈ రోజు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు సీఎం వైఎస్ జగన్.. అర్హులైన 357 మంది విద్యార్థుల విదేశీ విద్యకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించనున్నారు.. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి 45.53 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు సీఎం జగన్.. ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జగనన్న విదేశీ విద్యకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు… ఇక, ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ. 1.25 కోట్ల వరకు ఫీజు రీయింబెర్స్‌మెంట్ చేయనుండగా.. ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయనుంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.
వదలని వానలు.. డేంజర్ జోన్ లో వరంగల్..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ ప్రజలకు పలు సూచనలు చేసింది. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని సూచించింది. వర్షాకాలంలో బయటకు రావద్దని హెచ్చరించింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. వర్షాలు మరియు వరదల నుండి సహాయం కోసం 18004251980 నంబర్‌ను పేర్కొన్నారు. మరోవైపు తూర్పు, ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రిలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
శ్రావణమాసంలో ఆడవాళ్లు వీటిని అస్సలు దానం చెయ్యకూడదు..
శ్రావణమాసం అమ్మావారులకు ప్రత్యేకమైన మాసం.. ఈ మాసంలో ఆడవాళ్లు ప్రత్యేక పూజలు చేస్తారు.. ఈ మాసం లో మహిళలు కొన్ని తప్పులను అస్సలు చెయ్యకూడదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేస్తే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని చెబుతున్నారు. శ్రావణ మాసంలో మహిళలు అస్సలు దానం చేయకూడని వస్తువులు కూడా ఉన్నాయి. ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని పెద్దలు చెబుతూ ఉంటారు. రక్త దానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది.. ఎవరైనా అవసరంలో ఉన్న, ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తే దాన్నే దానం అని అంటారు. చాలామంది అన్నదానం చేస్తుంటారు. అలాగే మరి కొంత మంది వస్త్రాలు దానం చేస్తూ ఉంటారు. ఏవైనా వస్తువులు కూడా దానం చేస్తూ ఉంటారు. ఇలా తమకు తోచిన దానం చేస్తూ ఉంటారు. శనివారాలలో నూనెను దానం చేస్తారు.. ఏదైనా దానం చేస్తే అది అవతలి సంతోష పడేలా చెయ్యాలి.. అయితే కొన్ని వస్తువుల గురించి తెలుసుకొని దానం ఇస్తే ఇద్దరికీ మంచిది.. ఇకపోతే ఈ మాసం అమ్మవారికి అంకితం.. అందుకే మహిళలు వ్రతాలు చేస్తుంటారు.. అయితే చీపురు, ఉప్పు, కారం, ఇనుము ఎప్పుడు దానం చేయకూడదు. ఈ విధంగా దానం చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే అనారోగ్య పాలవుతారు. కాబట్టి మహిళలు ఈ వస్తువులను ఎప్పుడు దానం చేయకూడదు. ఏ దానం చేసిన ఏ పూజ చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి.. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.. కొన్ని నియమాలను పాటిస్తూ పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.. పూజలు చేసే టప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..
ప్రభుత్వ సంస్థల్లో 1324 జేఈ ఉద్యోగాలు..జీతం ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు సంస్థల్లో ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా SSC సంస్థ కూడా ఖాళీ ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. వివిధ విభాగాల్లో 1324 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ ఉద్యోగాల కు అర్హులైన అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. పోస్టులకు అనుగుణంగా కొన్ని పోస్టులకు 30 ఏళ్లు, మరికొన్నింటికి 32 ఏళ్లు వయో పరిమితి విధించారు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి. కొన్ని కేటగిరీల వారికి మినహాయింపులు ఉన్నాయి. ఏడో వేతన స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 చెల్లిస్తారు. పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాల కు ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు…
దరఖాస్తు ఫీ.. రూ.100 రూపాయలు.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు తప్ప.. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఆగస్టు 17, 18 తేదీల వరకు గడువు ఇచ్చారు. ఇది ఆన్లైన్ పరీక్ష..
8.5కోట్ల మంది రైతులకు ప్రధాని మోడీ కానుక.. వారి ఖాతాలో 17,000 కోట్లు
దేశంలోని 8.5 కోట్ల మంది రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ నేడు పీఎం కిసాన్ నిధి రూపంలో బహుమతిగా ఇవ్వబోతున్నారు. నేడు 14వ విడత పథకం రైతులకు విడుదల చేసి రైతుల ఖాతాలో రూ.17000 కోట్లు విడుదల చేయనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాజస్థాన్‌లోని సికార్‌లో గురువారం యాలి కార్యక్రమం ఉంటుందని.. అందులో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాకు బదిలీ చేస్తారు. PM కిసాన్ సమ్మాన్ నిధి సుమారు 4 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించబడింది. పీఎం కిసాన్ యోజనలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ద్వారా దేశంలోని రైతుల బ్యాంకు ఖాతాలో ప్రతి సంవత్సరం మూడు వాయిదాలలో 6,000 రూపాయలు బదిలీ చేయబడతాయి. ఫిబ్రవరి 2019 నుండి దేశంలోని 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ. 2.42 లక్షల కోట్లకు పైగా డబ్బు బదిలీ చేయబడింది. పీఎం ఫండ్ కింద బదిలీ చేయాల్సిన మొత్తాన్ని కూడా పెంచవచ్చని మధ్యలో వార్తలు వచ్చినా ఈ విషయం చర్చకే పరిమితమైంది. ఈ విషయం 2023 బడ్జెట్‌కు ముందే చర్చించబడింది. బడ్జెట్‌లో కూడా ప్రకటించవచ్చని భావించారు… కానీ అది జరగలేదు.
18 ఏళ్లకే మిస్ ఇండియా.. 22 ఏళ్లకు స్టార్ హీరోయిన్.. 55లోనూ అందాల సునామీ
ఏళ్ల వయసులో మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న 90ల నాటి నటి దీప్తి భట్నాగర్ మరోసారి తన బోల్డ్‌నెస్తో ముఖ్యాంశాల్లో నిలిచారు. నటి దీప్తి ఇటీవల తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీప్తి భట్నాగర్ స్విమ్మింగ్ పూల్‌లో తన అందాలను ఆరబోస్తున్న తీరు, ఆమె 90ల నాటి తన సహ నటీమణులను మాత్రమే కాకుండా నేటి యువ నటీమణులు జాన్వీ-అనన్యలను కూడా ఓడించింది. తన అందాలను చూసిన నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. శ్రీకాంత్ సరసన పెళ్లి సందడి సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ సినిమాలో తన అందాలకు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. అంతగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన దీప్తి భట్నాగర్ నేడు 55 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంత వయసులోనూ ఆమె అందం ఏమాత్రం తగ్గడం లేదు. దీప్తి భట్నాగర్ 90వ దశకంలో యాత్ర అనే టీవీ షోను కూడా నిర్వహించింది. అక్కడ ఆమె మతపరమైన పర్యటనలు, దేవాలయాల సందర్శనలను నిర్వహించేది. ఈ షోలో దీప్తి నగలు, చీరలపైనే ఎక్కువ మంది దృష్టి సారించారు. దీప్తి భట్నాగర్ ధర్మేంద్ర కోడలు, ధర్మేంద్ర సోదరుడు వీరేంద్ర కుమారుడు రణదీప్ ఆర్యను వివాహం చేసుకుంది. దీప్తి భట్నాగర్ 1990లో 18 సంవత్సరాల వయస్సులో మిస్ ఇండియా అయింది. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత, ఆమె ముంబైకి షిఫ్ట్ అయ్యి, నటన ప్రారంభించింది. కేవలం 11 నెలల్లోనే నటి అటువంటి విజయాల ఆకాశాన్ని తాకింది. ఆమె కేవలం 22 సంవత్సరాల వయస్సులో ముంబైలో తన ఇంటిని చేసింది. చాలా సంవత్సరాలు షోబిజ్‌లో భాగమైన తర్వాత నటి 2004 తర్వాత తెరపై కనిపించకుండా పోయింది. అయితే ఆమె సోషల్ మీడియాలో తన అభిమానులతో నిరంతరం కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆమె తన బోల్డ్ అవతార్‌ను చూపిస్తూ ఇంటర్నెట్‌లో భయాందోళనలు సృష్టిస్తోంది.