అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్ సంస్థతో రెండు ఒప్పందాలపై సీఎం జగన్ సంతకాలు చేశారు. బాలమృతం, అంగన్‌వాడీ పిల్లలకు పాల సరఫరాపై అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు అని వెల్లడించారు. ప్రైవేట్ డైరీల కన్నా ఎక్కువ రేటు ఇచ్చి అమూల్ సంస్థ పాలు…
అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. డంపింగ్ యార్డు వివాదం ఈ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీడీపీ నేతలు, వైసీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డుపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టుకు స్పందించిన వైసీపీ కార్యకర్తలు బాలయ్య ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు.…
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం నాడు తన నివాసంలో ఫ్రీడమ్ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈరోజు ఆగస్టు 15 కాదు.. జనవరి 26 కాదు. మరి ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకున్నారో ఇప్పుడు వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఇసుక వివాదం నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వార్నింగ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. దీంతో అప్పట్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.…
అనంతపురం జిల్లా టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన… వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. శనివారం ధర్మవరంలోని దుర్గానగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గౌరవసభ-ప్రజాసమస్యల చర్చావేదిక’ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. Read Also: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువే..…
కోర్టు ధిక్కరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా డీఈవో కె.శామ్యూల్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమంలో గానీ, అనాథాశ్రమంలో గానీ వారం రోజులు భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కక్షిదారులకు న్యాయం దొరకకుండా చేయడమే కాకుండా, కోర్టును అవమానించడమేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. Read Also: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే విల్లాల్లోకి చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్ అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ పి.వెంకటరమణకు…
ఏపీలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ, స్కూల్ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా… ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.…
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సమయాన్ని ఆయన కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. అనంతపురం జిల్లాలోని స్వగ్రామం నీలకంఠాపురంలో స్థానికులకు సేవ చేసుకుంటూ రఘువీరారెడ్డి కాలం వెళ్లదీస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన యాక్టివ్‌గా ఉంటారు. Read Also: రౌండ్ల వారీగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తాజాగా రఘువీరారెడ్డి ట్విట్టర్‌లో ఓ ఫన్నీ ఫోటోను పోస్ట్ చేశారు. తనతో ఆడుకోవడం లేదనే కారణంతో…
హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ పరంగా ఫుల్లు స్పీడుగా దూసుకెళ్తోంది. పేరుకు మలయాళీ ముద్దుగుమ్మ అయినా తెలుగు సినిమాల్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలే నాగచైతన్యతో జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. తద్వారా టాలీవుడ్‌కు మళ్లీ పూర్వపు వైభవాన్ని ఈ మూవీ తెచ్చిపెట్టింది. ఈ మూవీలో సాయిపల్లవి తన డ్యాన్సులతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. ఫిదా…