ఏపీలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఎస్ఎస్‌బీఎన్ కాలేజీ, స్కూల్ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా… ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
Read Also: వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు: టీడీపీ నేత పట్టాభి
అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై లాఠీఛార్జి చేసి వారి తలలు పగలకొట్టడం సీఎం జగన్ అహంకార ధోరణికి నిదర్శనమని ఆరోపించారు.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం @ysjagan అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/3) pic.twitter.com/14TKhQIGyt
— Lokesh Nara (@naralokesh) November 8, 2021