కూటి కోసం, కూలీ కోసం రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గోడ కూలి ఇద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు దగ్గర నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తు ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టగా.. ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆ చిన్నారి ఉదయాన్నే నిద్ర లేచింది. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంది. పుట్టినరోజు కావడంతో కుటుంబసభ్యుల తీసుకుంది. పాఠశాలకు వెళ్లి అందరికి చాకెట్లు పంచింది. అయితే.. ఆ చిట్టితల్లికి తెలియదు.. పుట్టిన రోజే తనకు ఆఖరి రోజు అవుతుందని. పుట్టిన రోజున ఆనందంగా గడిపిన ఆ చిన్నారి విషాదకర రీతిలో మృతి చెందింది.
పట్టుదల ఉంటే పేదరికం అనేది అడ్డుకాదని.. చదవాలనే తపన ఉంటే కుటుంబ పరిస్థితులు, వయస్సు అసలు ఆటంకమే కాదని నిరూపించింది ఓ మహిళ. లక్ష్యం జీవితాన్ని విజయపథాన నడిపిస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఆ మహిళ. దినసరి కూలీగా ఎండనకా, వానెనకా చెమటోడుస్తూనే.. చదువుపై ఉన్న ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో ఎట్టకేలకు రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మరోసారి టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో జిల్లాకు జాకీ పరిశ్రమ వచ్చిందా అని మీడియా సాక్షిగా ఆయన ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ అనేది ఒక లూటీ పరిశ్రమ అని.. ఇతర రాష్ట్రాల్లో యూనిట్లను ఎత్తివేసిందని ఆరోపించారు. ఆరోజు చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు అప్పటి మంత్రి పరిటాల సునీత పాటించారని.. అందరూ కలిసి రూ.300 కోట్ల స్కామ్ చేసేందుకు ప్రయత్నించారని తోపుదుర్తి…
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాని పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభూత కల్పనలను నిజాలుగా చూపించే క్రెడిట్ టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చింది భూముల కోసమేనని.. వారు ఇక్కడ భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. జాకీ పరిశ్రమ టీడీపీ హయాంలో వచ్చినట్లు.. వైసీపీ హయాంలో వెనక్కి…
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో శుక్రవారం అర్ధరాత్రి భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను దుండగులు కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్‌లోనే ఆగిపోయింది. రైలు ఆగగానే బోగీల్లోకి చొరబడిన దుండగులు మారణాయుధాలు చూపించి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. వారి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ముఖ్యంగా ఎస్ 5, ఎస్ 7, బోగీల్లో ప్రయాణిస్తున్న మహిళల…
ఏపీలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరినట్లు సమాచారం. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కాగా ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను…