అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం నాడు తన నివాసంలో ఫ్రీడమ్ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈరోజు ఆగస్టు 15 కాదు.. జనవరి 26 కాదు. మరి ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకున్నారో ఇప్పుడు వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఇసుక వివాదం నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వార్నింగ్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. దీంతో అప్పట్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అప్పుడు జరిగిన గొడవలు దాదాపు 15రోజుల పాటు తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.
Read Also: ఆదిత్య బిర్లా కంపెనీతో 2వేల ఉద్యోగాలు: సీఎం జగన్
అయితే ఈ ఘటన తరువాత టీడీపీ కార్యకర్తలు యాక్టివ్ అయ్యి అధికార పార్టీ అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే.. ఒక్క తాడిపత్రిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. డిసెంబర్ 24, 2020న జరిగిన ఘటనతోనే ఈ విజయం దరిచేరిందని… ఆరోజే తమకు ఫ్రీడమ్ వచ్చిందని.. అందుకే ఈరోజు ఫ్రీడమ్ పేరుతో సంబరాలు జరుపుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి సన్నిహితులు వెల్లడించారు. ఈ సందర్భంగా కేక్‌ను అభిమానులు, కార్యకర్తల మధ్య జేసీ ప్రభాకర్‌రెడ్డి కట్ చేశారు. అనంతరం బాణసంచా పేల్చి విందు భోజనం కూడా చేశారు.