Pre Planned Bank Robbery: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దొంగలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ట్రిక్కులతో డబ్బులు కాజేస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని ఐడీబీఐ బ్యాంకులో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. సినీ ఫక్కీలో బ్యాంకుకి కన్నమేశారు దొంగలు. ఐడీబీఐ బ్యాంకు వద్ద 46 లక్షల రూపాయలు చోరీ చేశారు దొంగలు. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ ఉద్యోగి పోతురాజుపై దాడి చేసి నిర్భందించి నగదు దోచుకెళ్లినట్లు బ్యాంకు ఉద్యోగులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాల సాయంతో విచారణ ప్రారంభించారు.
Read Also: Tamilnadu : తమిళనాడులో వర్ష బీభత్సం.. చిక్కుకున్న 800 మంది కోసం 48గంటలుగా రెస్క్యూ ఆపరేషన్
వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.. డబ్బు కోసం బ్యాంకు ఉద్యోగి పోతురాజు డ్రామా ఆడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పొంతనలేని సమాధానాలు చెప్పటంతో పోతురాజును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. డబ్బు కోసం స్నేహితులతో కలిసి చోరీ డ్రామా ఆడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఇవాళ నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.