Thopudurthi Prakash Reddy: టీడీపీ హయాంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదు.. చీకటి ఒప్పందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాని పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభూత కల్పనలను నిజాలుగా చూపించే క్రెడిట్ టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చింది భూముల కోసమేనని.. వారు ఇక్కడ భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. జాకీ పరిశ్రమ టీడీపీ హయాంలో వచ్చినట్లు.. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని.. లీజు ప్రాతిపదికన ఏ కంపెనీ వచ్చినా పరిశ్రమలు పెట్టేందుకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.
Read Also: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంది వీళ్లకే
Also Read
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
రైతుల భూములతో వ్యాపారాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పరిటాల సునీత సివిల్ సప్లై మినిస్టర్‌గా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. రైతులను మభ్య పెట్టేందుకు ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారని.. అమరావతి నిర్మాణం చేయకుండా చంద్రబాబు తన చాతుర్యంతో ప్రజలని భ్రమలో పెట్టారని చురకలు అంటించారు. నారా లోకేష్ ఒక నామినేటెడ్ రాజకీయ నాయకుడు అని.. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో పరిశ్రమలు తెచ్చామన్న భ్రమలు కల్పించారని.. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ జిల్లా టీడీపీ నేతలు గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ హయాంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదని.. అవి చీకటి ఒప్పందాలు అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!