Thopudurthi Prakash Reddy: టీడీపీ కారణంగా జాకీ పరిశ్రమను రమ్మని చెప్పినా రావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మరోసారి టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో జిల్లాకు జాకీ పరిశ్రమ వచ్చిందా అని మీడియా సాక్షిగా ఆయన ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ అనేది ఒక లూటీ పరిశ్రమ అని.. ఇతర రాష్ట్రాల్లో యూనిట్లను ఎత్తివేసిందని ఆరోపించారు. ఆరోజు చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు అప్పటి మంత్రి పరిటాల సునీత పాటించారని.. అందరూ కలిసి రూ.300 కోట్ల స్కామ్ చేసేందుకు ప్రయత్నించారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రానికి రూ.40లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని అప్పటి మంత్రి లోకేష్ చెప్పారని.. ఇప్పుడు ఆ పెట్టుబడులు కాకులు ఎత్తుకెళ్లాయా అని చురకలు అంటించారు. రికార్డుల్లో 14 కంపెనీలు వచ్చినట్టు చూపారని.. అవి ఎక్కడికి వెళ్లాయని నిలదీశారు.
Read Also: Super Star Krishna: కృష్ణ మరణం ముందు రోజు ఏం జరిగింది.. సంచలన నిజాలు వెలుగులోకి..?
Also Read
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ కసరత్తు.. అభ్యర్థుల ఖరారుపై మాజీ సీఎం జగన్ కీలక సూచనలు..
- Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
రాని పరిశ్రమలు వచ్చాయని టీడీపీ నేతలు కట్టు కథలు చెప్పారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాకీ కోసం రూ.140 కోట్లు విలువైన భూమిని రూ. 2.5 కోట్లకు సేల్ డీడ్ చేశారని.. మరి ఆ రోజు పరిశ్రమ ఎందుకు కట్టలేకపోయారని నిలదీశారు. పరిటాల సునీత అబద్దాలు చెప్పడంలో ఆరితేరిపోయారని.. 2018 అక్టోబర్‌లోనే ఉత్పత్తి, ట్రైనింగ్ ప్రారంభించాలని ఒప్పందంలో ఉందని.. కాంపౌండ్ వాల్ సగంలోని ఎందుకు ఆపేశారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నించారు. జాకీ పరిశ్రమ నిర్వాహకులు తిరుపూరు, బెంగళూరులో నాలుగు యూనిట్లు మూసివేశారని.. ఇలాగే రాప్తాడులో కూడా జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని వివరించారు. ఈ రోజు కూడా జాకీ పరిశ్రమను రమ్మని చెప్పినా రావడం లేదని.. భువనేశ్వర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భూములు తీసుకున్నారని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని.. మార్కెట్ ధరకు తాము భూములు కేటాయిస్తున్నామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. కనీసం 12సంవత్సరాలు ప్రొడక్షన్ ఉంటే భూమి అమ్ముకునే హక్కు కల్పిస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!