Road Accident: అనంతపురం జిల్లా గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తు ట్రాక్టర్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టగా.. ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్నతిప్పయ్య(45), శ్రీరాములు(45), నాగార్జున(30), శ్రీనివాసులు(30)గా గుర్తించారు.
Read Also: Coronavirus: కరోనా అలజడి.. తెలంగాణలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు
ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ క్రమంలో అతడిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.