Stampades : రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపసంఘం, క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వనుంది. Patek Philippe Watch: 82 ఏళ్ల క్రితం తయారీ.. వేలంలో రూ.156 కోట్లకు అమ్ముడైన పటేక్…
ఆ ఏపీ మంత్రులు ఇద్దరూ.... తమ జిల్లాను పూర్తిగా గాలికొదిలేశారా? ప్రతిక్షానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి భయపడుతున్నారా? వాళ్ళు రెచ్చిపోతున్నా... వీళ్ళు కామ్‌గా ఉండటం వెనక వేరే లెక్కలున్నాయా? ఎవరా ఇద్దరు మినిస్టర్స్? ఎందుకు వాళ్ళలో స్పందనలు కరవయ్యాయి?
Minister Anam: నెల్లూరు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఎన్నికల ముందు 143 వాగ్దానాలతో పాటు ఈవీఎంలను లోబర్చుకుని చంద్రబాబు గెలిచారని, గెలిచి ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్ ఆరోపించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వెన్నుపోటు దినం రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డు పైకి వచ్చారని చెప్పారు. ప్రతి కార్యక్రమంలో జగన్‌ని నిందిస్తున్నారని.. అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని.. దిగజారుడు మాటలు మాట్లాడటానికి సిగ్గు అనిపించడం…
Minister Anam: శ్రీశైలంలో మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.. ఈనెల 25, 26 రెండు రోజులు శ్రీశైలం టోల్ గేట్లు ఉచితం చేస్తాం..
ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో పలువురు మంత్రులు పాలు పంచుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. "చంద్రబాబు హయాంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ వైసీపీకి చెందిన నేత ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 లో మంత్రి ఇక్కడ నుంచి ఉన్నా అభివృద్ధి లేదు. యువ గళం పాదయాత్ర సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పుడు…
రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందన్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరుగురు మంత్రులు తిరుపతికి వెళ్లి వారిని…
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీవారికి సమర్పించే ప్రసాదాల నాణ్యత బాగా పెరిగిందన్నారు. 5400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు అందజేసే రూ.5 వేల రూపాయలను రూ.10 వేలకు పెంచామన్నారు. ప్రతి నెల తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులును పరిశిలిస్తాను అని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో…