తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీవారికి సమర్పించే ప్రసాదాల నాణ్యత బాగా పెరిగిందన్నారు. 5400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు అందజేసే రూ.5 వేల రూపాయలను రూ.10 వేలకు పెంచామన్నారు. ప్రతి నెల తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులును పరిశిలిస్తాను అని మంత్రి ఆనం చెప్పుకొచ్చారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో మంత్రి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం అన్నవితరణ కేంద్రం వద్ద ఫిర్యాదుల పుస్తకాలను తనిఖీ చేశారు. సౌకర్యాలు బాగున్నాయని ఫిర్యాదుల పుస్తకంలో భక్తులు రాశారని చెప్పారు. తిరుమలను ప్రక్షాళన చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఇంకా అభివృద్ధి చేయాలని మంత్రి ఆనం పేర్కొన్నారు.
Also Read: Ram Gopal Varma: ఏపీ హైకోర్టులో రామ్‌గోపాల్ వర్మ మరో పిటిషన్!
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ…’అన్నవితరణ కేంద్రం వద్ద ఫిర్యాదుల పుస్తకాలను తనిఖీ చేశా. తిరుమలలో సౌకర్యాలు బాగున్నాయని ఫిర్యాదుల పుస్తకంలో భక్తులు రాశారు. చాలా సంతోషంగా అనిపించింది. తిరుమలను ప్రక్షాళన చేయాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఇంకా అభివృద్ధి చేయాలి. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీవారికి సమర్పించే ప్రసాదాల నాణ్యత బాగా పెరిగింది. 5400 ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు అందజేసే 5 వేల రూపాయలను 10 వేలకు పెంచాం. నూతన ఆలయాలకు కూడా ధూప దీప నైవేద్యాలు క్రింద 10 వేలు అందజేసే ప్రకియ ప్రారంభించాం. మఠాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి. అక్కడ వ్యాపార కేంద్రాల మారితే చర్యలు తప్పవు. ప్రతి నెల తిరుమలలో జరుగుతున్న అభివృద్ధి పనులును పరిశిలిస్తా’ అని చెప్పారు.