TDP: నెల్లూరు రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. జిల్లాలోని పది స్థానాల్లో పరాజయం పాలైన టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో తన బలాన్ని చూపేందుకు తీవ్ర యత్నాలు చేస్తోంది. వైసీపీని వీడిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై ఫోకస్ చేసింది. ఈ ముగ్గురిని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు విస్తృత మంతనాలు జరిపారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ నెల 13న…
నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.
Pawan Kalyan: నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనంను తప్పించి ఆ పదవిని నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి అధిష్టానం అప్పగించినప్పటి నుంచి పార్టీకి.. ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉంది.. ఇక, తన భద్రతను కుదించడంపై ఆన ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, ఆనం రామనారాయణ రెడ్డి ప్రాణ రక్షణ బాధ్యత డీజీపీ తీసుకోవాలని డిమాండ్…
ఆనం రామనారాయణ రెడ్డికి పిచ్చి ముదిరిందని వైసీపీ నేత నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి అన్నారు. తనను రాజ్యాంగేతర శక్తి అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారని మండిపడ్డారు.
ఆనం రామనారాయణరెడ్డి. నెల్లూరుకే కాదు.. రాష్ట్ర రాజకీయాలకు సుపరిచితుడు. టీడీపీలో రాజకీయాల్లోకి వచ్చి అక్కడే మంత్రి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చి వైఎస్ కేబినెట్‌లో మంత్రి అయిన సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్‌లో ప్రారంభమైన రాజకీయ జీవితాన్ని టీడీపీ.. టీడీపీ నుంచి కాంగ్రెస్.. కాంగ్రెస్ నుంచి మళ్లీ టీడీపీ.. ఇప్పుడు వైసీపీ. మొన్నటి ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచారు ఆనం. సీనియారిటీ.. కేబినెట్‌లో చోటు తెచ్చిపెడుతుందని ధీమాతో ఉన్న ఆనంకు జగన్ ఝలక్ ఇచ్చారు. సీనియర్ మోస్ట్…
మేం సిగ్గు పడుతున్నాం.. అధికారులుగా మీకు ఉందో లేదో నాకు తెలియదు అంటూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి.. నెల్లూరు జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన.. నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రారంభిస్తామని అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలను అధికారులు బేఖాతరు చేస్తున్నారని.. తప్పుడు సమాచారం ఇచ్చి.. ముఖ్యమంత్రి చేత తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్…
వాళ్లిద్దరి మాట వేరు.. బాట వేరు. మొన్నటి వరకు ఒకేపార్టీలో ఉన్నా.. ఎన్నికలకు ముందు వేర్వేరు పార్టీల్లో ఉండిపోయారు. ఇప్పుడు సడెన్‌గా వారిద్దరి మాట-బాట కలిసింది. అది అంతవరకే పరిమితం అవుతుందా? అంతకుమించి ఇంకేమైనా ఉంటుందా అనే ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఎవరా నేతలు..? కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కలిపిందా? టీడీపీలో కీలక నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి…
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా వుంటాయి. తాజాగా వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో సుదీర్ఘ ప్రస్తావన చేశారు. సలహా మండలిలో జిల్లా ఏర్పాటు లో అభ్యంతరాలు ప్రభుత్వానికి పంపాలన్నారు. ఆనం వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రాంకుమార్ రెడ్డి. విభజన వల్ల సోమశిల ప్రాజెక్టు నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు…