నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రేపు ఉదయం సీఎం చంద్రబాబును దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తామని తెలిపారు. దాదాపు 13 శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన యజ్ఞం అమ్మవారి ఉత్సవాలు.. సామాన్య భక్తులకు పార్కింగ్ లాట్స్ వద్ద నుంచి, క్యూలైన్ల నుంచి త్రాగునీరు ఇస్తామని అన్నారు.
Anam Ramanarayana Reddy: ఏపీ సచివాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించారు. బ్లాక్-2లోని తన ఛాంబర్‌లో పూజలు చేసిన వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు.
Pension In AP : నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy ) మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని, ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని, జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని ఆయన చెప్పుకొచ్చారు. రూ.3 వేల పెన్షన్…
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్ది మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు నూతన అధ్యాయనికి శ్రీకారం చుట్టారు.. వైసీపీకి డబుల్ డిజిటల్ కూడా దక్కకపోవడాన్ని చూస్తే ప్రజా వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం అవుతుందన్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బాలాయపల్లి ఎంపీపీ పిలిస్తే మండల సమావేశానికి ఎమ్మెల్యే ఆనం వచ్చేస్తాడా? అని ప్రశ్నించారు. ఆనంవి సిగ్గులేని పనులు.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా పిలవని పేరంటాలకు వచ్చేస్తాడని విమర్శించారు. కండలేరు జలాశయం నుంచి తెలుగుగంగ ద్వారా రైతులకు 200 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. 500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అనం అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి - గూడూరు రహదారి పనుల విషయంలో ఎమ్మెల్యే ఆనంపై ఇటీవల ఇంచార్జ్ నేదురుమల్లి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. నేదురుమల్లి ఆరోపణల్లో వాస్తవం లేదంటూ ఆనం వెల్లడించారు. రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక దుస్థితి వల్లే కాంట్రాక్టర్లు పనులు చేయడం మానేశారని కీలక…