Stampades : రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపసంఘం, క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వనుంది.
Patek Philippe Watch: 82 ఏళ్ల క్రితం తయారీ.. వేలంలో రూ.156 కోట్లకు అమ్ముడైన పటేక్ ఫిలిప్ వాచ్
ప్రత్యేకంగా, 2019-24 మధ్యలో దేవాలయాలపై జరిగిన దాడులు, వాటిపై తీసుకున్న చర్యలపై పర్యవేక్షణ చేయాలని ఆదేశం ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. దేవాలయాల భద్రత, పర్యవేక్షణ, అవసరమైన చర్యలపై ఈ ఉపసంఘం సమగ్రంగా నివేదిక ఇవ్వనుంది. ఉపసంఘం సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.