ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో పలువురు మంత్రులు పాలు పంచుకున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “చంద్రబాబు హయాంలో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇక్కడ వైసీపీకి చెందిన నేత ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 లో మంత్రి ఇక్కడ నుంచి ఉన్నా అభివృద్ధి లేదు. యువ గళం పాదయాత్ర సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నాం. 2014కు ముందు ఆగిన పనులను పూర్తి చేస్తున్నాం. సోమశిల జలాశయాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సోమశిలకు నిధులు ఇచ్చారు. అనేక అభివృద్ధి పనులను చేపడుతున్నాం. బి సి బాలికల గురుకుల పాఠశాల మంజూరైనా వసతి లేక ప్రారంభించలేదు. ఇప్పుడు తాత్కాలిక భవనంలో ప్రారంభించాం.” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Nimmala Rama Naidu : ఇరిగేషన్ పనులకు రూ. 320 కోట్లు.. మార్చిలోగా పూర్తి చేయాలన్న మంత్రి
త్వరలోనే నూతన భవనానికి నిధులు ఇస్తామని మంత్రి సవితమ్మ హామీ ఇచ్చారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. “అభివృద్ధి అంటే మనం తెల్ల చొక్కాలు వేసుకోవడం కాదు. పేదలు విద్యను అభ్యసించి జీవితంలో ఎదిగేలా చేయడమే మా లక్ష్యం. అమృత్.2 కింద ఆత్మకూరుకు మంచినీటి వసతి కోసం రూ. 10 కోట్లను వెచ్చిస్తున్నాం. ఆత్మకూరు లో పార్క్ ల కోసం రూ.2 కోట్లు ఇస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. అందరి సహకారంతో హామీలు నెరవేరుస్తాం.” అని మంత్రి తెలిపారు.
READ MORE: Shraddha Walker: శ్రద్ధా వాకర్ తండ్రి మృతి.. చివరి శ్వాస వరకు అందని అస్థికలు..