అనర్హత నోటీసుపై స్పీకరు తమ్మినేని సీతారాంను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిశారు. స్పీకర్ తో పర్సనల్ హియరింగ్ కు హాజరుకావడం రెండోసారి అని అన్నారు. మొదటి సారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారనీ.. అవన్నీ తాను చెప్పినట్లు ఆనం తెలిపారు. దానికి సంబంధించిన పేపర్స్ ను కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అనర్హత నోటీసుపై స్పీకర్ కు 5వ తేదీన తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చామని అన్నారు. మీడియాలో ప్రచురించిన వాటిని చీఫ్…
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ అనంతరం ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ చీఫ్ విప్ తమ పై ఫిర్యాదు చేశారని స్పీకర్ చెప్పారన్నారు. కంప్లైంట్ ఇచ్చిన చీఫ్ విప్ ప్రసాద్ రాజు…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ కలిసి వేల కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారు అంటూ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. 800 కోట్ల రూపాయల విలువైన పేదల భూములను దోచేశారు.. త్వరలోనే నారాయణ కూడా అరెస్టు అవుతారు.. అందుకే ఆయనకు భయం పట్టుకుంది..