BJP: భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం జూన్ 11న తమ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఎంపీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
Wrestlers Protest: భారత రెజ్లర్ సమాఖ్య( డబ్ల్యూఎఫ్)చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాని కోరారు. అందుకు షా.. చట్టం అందరికీ సమానమేనన్నట్లు వారికి భరోసా ఇచ్చారు. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అంటూ రెజ్లర్లతో అన్నట్టు పునియా తెలిపారు.
Manipur Violence: మణిపూర్లో గత నెలలో మొదలైన హింస సద్దుమణిగేలా కనిపిస్తోంది. గత 20 గంటలుగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. ఈరోజు ఇంఫాల్ ఈస్ట్, విష్ణుపూర్తో సహా అనేక హింస ప్రభావిత జిల్లాల్లో కర్ఫ్యూను 8 నుండి 12 గంటల పాటు సడలించారు.
Amit Shah Visit To Moreh: మణిపూర్లో చెలరేగిన ఘర్షణలను కట్టడి చేసి.. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. గత రెండు రోజుల నుంచి పలు సంఘాలు, జాతుల నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేకంగా రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలో కూడా హోం మంత్రి పాల్గొన్నారు. సంఘాలు, జాతులతో నిర్వహించిన సమావేశాల సారాంశాలను రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రంలో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో…