Gudivada Amarnath Response on Amit Shah’s attack on YSRCP Government: ఏపీ ప్రభుత్వం రాజధానిగా ప్రమోట్ చేసుకుంటున్న విశాఖలో సభ ఏర్పాటు చేసిన ఏపీ బీజేపీ ఏకంగా హోం మంత్రి అమిత్ షాను సభకు ఆహ్వానించింది. అక్కడికి వచ్చిన ఆయన అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు వైసీపీ మంత్రులు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. తాజాగా కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల ముందు ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పై అమిత్ షా, నడ్డా విమర్శలు ఉన్నాయని పేర్కొన్న ఆయన మాకు ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులు లేవని, కేంద్రంలో అధికారంలో ఉండే ఏ పార్టీతో నైనా సత్ససంబంధాలు కొనసాగించడం సహజం అని అన్నారు.
Also Read: Plastic Covers: హృదయం ద్రవించే ఘటన.. ఆవు, దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్ భూతం
మీరు మమ్మల్ని ఏ విధంగా చూస్తే మేం మిమ్మల్ని అదే విధంగా గౌరవిస్తాం, షా, నడ్డా మీటింగ్ తర్వాత బీజేపీ కంటే టీడీపీలో ఎక్కువ సంబరాలు కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ.. టీజేపీగా మారిపోయిందన్న ఆయన అమిత్ షా మీటింగ్ వేదికపై ఉన్నది ఎవరు?.. సీఎం రమేష్, పురంధేశ్వరి, సుజనా చౌదరి వీరంతా బీజేపీ నాయకులా? అని అంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక ఒకప్పుడు రాళ్లు వేసిన అమిత్ షాపై ఇప్పుడు టీడీపీ నాయకులు పువ్వులు వేస్తున్నారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కనీసం ఒక్క సీటు లేని బీజేపీ 20 సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది? అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో విద్రోహ శక్తులు ఉన్నాయనే అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న అమర్నాథ్ ఏపీ ప్రజల సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కుపై ఒక్క మాట మాట్లాడలేదని గుర్తు చేశారు. విభజన హామీల వల్ల వచ్చిన ఎయిమ్స్, యూనివర్సిటీల గురించి చెబుతున్న బీజేపీ ఈ నాలుగేళ్ళలో ఒక్క కొత్త సంస్థ నైనా మంజూరు చేసిందా….? అని ప్రశ్నించారు.