Manipur Violence: గత నెల రోజులుగా జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా శుక్రవారం అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. ఇద్దరు గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ రాజ్యం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ ఖేల్ ఖతం అయిందని ఆయన అన్నారు. బీజేపీ మహా జన సంపర్క్ అభియాన్ సన్నాహక సభలో ఆయన మాట్లాడారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు. సభకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ముఖ్యఅతిథిగా అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు.
BJP: భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం జూన్ 11న తమ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఎంపీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
Wrestlers Protest: భారత రెజ్లర్ సమాఖ్య( డబ్ల్యూఎఫ్)చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు హోం మంత్రి అమిత్ షాని కోరారు. అందుకు షా.. చట్టం అందరికీ సమానమేనన్నట్లు వారికి భరోసా ఇచ్చారు. చట్టం దాని పనిని చేసుకుపోనివ్వండి అంటూ రెజ్లర్లతో అన్నట్టు పునియా తెలిపారు.