YV Subba Reddy Strong Counter To Amit Shah Comments: తన విశాఖ పర్యటనలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడింది.. పసుపు కండువా మార్చి, కాషాయ చొక్కాలు వేసుకున్న వాళ్ళ మాటల్ని అమిత్ షా పలకడం దారుణమని మండిపడ్డారు. చిత్తశుద్ధితో నడుస్తున్న ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారని ఫైరయ్యారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో చెప్పి, అప్పుడు బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుండేదని హితవు పలికారు. 2014-19 వరకు టీడీపీతో కలిసున్న బీజేపీ.. అప్పుడు ఏం చేసిందని ప్రశ్నించారు. టీడీపీ అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. 2014 ఎన్నికల నాటి హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ఒక్కమాటైన చెప్పకుండా.. 20 పార్లమెంట్ సీట్లు ఇవ్వండని అమిత్ షా అడుగుతున్నారని చెప్పారు.
CM YS Jagan: చంద్రబాబు బతుకంతా వాగ్ధానాలు, వెన్నుపోట్లే.. సీఎం జగన్ ధ్వజం
కాగా.. మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో చిక్కుకుపోయిందని వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని, అది చూసి ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధుల్నే.. సీఎం జగన్ ‘రైతు భరోసా’ పేరుతో ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ, ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. పేదలకు కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యంపై ముఖ్యమంత్రి తన బొమ్మ వేసుకుంటున్నారని.. జగన్ ప్రభుత్వంలో నిధులు అవినీతికి గురయ్యాయని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు 2 లక్షల 30 వేల కోట్లు ఏపీకి వస్తే.. ఆ డబ్బంతా ఎక్కడికిపోయిందని నిలదీశారు. విశాఖలో భూ మాఫియా, అక్రమ మైనింగ్, పార్మా కంపెనీల్లో తప్పులు జరుగుతున్నాయని చెప్పారు. ఇలా ఈ విధంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు.. వైవీ సుబ్బారెడ్డి పైవిధంగా స్పందించారు.
Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్లు పెంచండి ప్లీజ్.. ఏపీ సీఎంను కోరనున్న నిర్మాతలు?