ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు… రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరనున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. ఇక, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు.. డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఏపీ సీఎం జగన్.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టారు. ఈ అంశంలో సహకారం కోరేందుకు.. హోమ్ మంత్రి అమిత్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢీల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించిన నిధులు, పెండింగ్‌లో ఉన్న అంశాలపైన, విభజన చట్టంలో అమలు చేయాల్సిన హామీల పైన సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రి షాతో చర్చించబోతున్నారు. షాతో భేటీ తరువాత ఢిల్లీలో అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులతో కూడా సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కరోనా కారణంగా పోలవరం…
టౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బలమైన యాస్ తుఫాన్ గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తూర్పు తీరప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో…
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసుపై ఆయనను ఇటీవల ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా, తనను కొట్టారంటూ ఆయన ఆరోపించడంతో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రఘురామకృష్ణంరాజు కూతురు ఇందు ప్రియదర్శిని, కుమారుడు భరత్ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రఘురామపై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలను అమిత్‌షాకు ఇందు…