Amit Shah: 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి విడిపిస్తామని మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బస్తర్ పాండు కార్యక్రమంలో జరిగిన సభలో షా ప్రసంగిస్తూ.. బస్తర్లో మావోయిజం అంతమయ్యే దళలో ఉందని, వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో ‘‘లాల్ ఆతంక్’’ పట్టు నుంచి విముక్తి చేయడానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను, తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చుతూ.. వక్ఫ్ బోర్డులో ముతవల్లీ ముస్లిం మాత్రమే ఉంటారని తెలిపారు. అన్యమతానికి చెందిన ఏ సభ్యుడినీ అనుమతించబోమని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం.. వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతరులు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోరని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
లోక్సభలో వక్ఫ్ చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్, హోంమంత్రి అమిత్ షా మధ్య చర్చ జరిగింది. ఈ చర్చ నవ్వుకు దారితీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భావించే బీజేపీ తన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. పార్లమెంట్ లో సభ్యులు మొత్తం నవ్వారు. అఖిలేష్ ప్రకటనకు అమిత్ షా స్పందించి ప్రసంగం మధ్యలో లేచి నిలబడ్డారు. అఖిలేష్ యాదవ్ నవ్వుతూ ఈ విషయం చెప్పడంతో ఆయన కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇక్కడ చాలా పార్టీలు…
దండకారణ్యంలో ఏం జరుగుతుంది.. దండకారణ్యం మొత్తాన్ని కూడా భద్రతా బలగాలు ఖాళీ చేయిస్తున్నాయా.. మావోయిస్టుల పట్టు బిగిస్తున్నారా లేక సడలిస్తున్నారా అర్థం కాని పరిస్థితి.. దండకారణ్యం మొత్తం కూడా ఇప్పుడు భద్రత బలగాల చేతుల్లోకి వెళ్ళిపోతుందా? దండకారణ్యం భూభాగంలోకి అడుగుపెట్టడానికే జంకిన బలగాలు ..ఇప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాయా… దండకారణ్యంలో ఎందుకు మావోయిస్టు పట్టు కోల్పోతున్నారు.. అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది ..ఏడాది కాలంలో మావోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోయారా? ఏడాది కాలంలో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బలు…
Amit Shah: ఛత్తీస్గఢ్ దండకారణ్యం వరస ఎన్కౌంటర్లతో నెత్తురోడుతోంది. వరసగా భద్రతా బలగాల దాడుల్లో మావోయిస్టులు మరణిస్తున్నారు. తాజాగా, శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లో ఇది భద్రతా బలగాల విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. సంఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆటోమెటిక్ ఆయుధాల నిల్వను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇమ్మిగ్రేషన్ బిల్లును లోక్సభ ఈరోజు (మార్చి 27) ఆమోదించింది. చొరబాటు, అక్రమ వలసలను ఆపడం లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లు పేరు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్లు 2025. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి కోసం వస్తున్న వలసదారులను మేము స్వాగతిస్తామని హోంమంత్రి లోక్సభలో వెల్లడించారు. విద్య, వ్యాపారం, పరిశోధన కోసం దేశానికి వచ్చే వారిని మేము స్వాగతిస్తాము. 2047 నాటికి దేశం…
AIADMK-BJP: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళని స్వామి, కేంద్ర హోం మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు నేతలు కూడా గంటల తరబడి చర్చించారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీ-అన్నాడీఎంకేల పొత్తు తెర పైకి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రవాణా వ్యవస్థలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు పెను మార్పులు తీసుకొచ్చాయి. ఆన్ లైన్ లో బుక్ చేస్తే చాలు నిమిషాల్లో వెహికల్ ఇంటి ముందుకు వచ్చేస్తోంది. ఇదే సమయంలో టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులు ఉపాధి పొందుతున్నారు. అయితే ఆయా సంస్థలు కమిషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తాము నష్టపోతున్నామని ఓలా, ఉబర్ వంటి సర్వీసులతో వాహనాలు నడిపే డ్రైవర్లు ఆందోళన చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్యాక్సీ డ్రైవర్లకు…
Congress: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ‘‘నిందించే వ్యాఖ్యలు’’ చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆ పార్టీ బుధవారం ‘‘సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం’’ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ నోటీసుల్ని సభలో ప్రవేశపెట్టారు.