Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టులను టార్గెట్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడిలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా, 12 మంది గాయపడినట్లు చెబుతున్నారు. అయితే, మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ దాడిని ప్రధాని నరేంద్రమోడీ సహా అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ఖండించారు. దాడికి పాల్పడినవారిని ఖచ్చితంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు హోం మంత్రి అమిత్ షా ఘటనా స్థలానికి బయలుదేరారు.
అయితే, పక్కా ప్లాన్ ప్రకారమే ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై దగ్గర నుంచి కాల్పులు జరిపారు. పేరు, మతం అడుగుతూ, ఐడెంటిటీ కార్డులు చెక్ చేస్తూ చంపేశారు. ఈ దాడికి సంబంధించిన భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్కతున్నాయి. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఒక వ్యక్తిని కాల్చి చంపిన తర్వాత, టెర్రరిస్టులు అతడి భార్యతో మాట్లాడుతూ.. ‘‘మోడీకి వెళ్లి ఈ విషయం చెప్పు’’ అని అన్నాడు. ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Read Also: Ahaan Panday: అనన్య పాండే కజిన్ హీరోగా ‘సయారా’… జూలై 18న రిలీజ్!
శివమొగ్గకు చెందిన కుటుంబం సెలవుల్లో కాశ్మీర్ విహారయాత్రకు వెళ్లింది. మంజునాథ్ అతడి భార్య పల్లి, కొడుకుతో కాశ్మీర్ లోయకు వెళ్లారు. దాడికి సంబంధించిన విషయాలను పల్లవి వివరించారు. “మేము ముగ్గురం – నేను, నా భర్త మరియు మా కొడుకు – కాశ్మీర్‌కు వెళ్ళాము. ఇది మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగిందని నేను అనుకుంటున్నాను. మేము పహల్గామ్‌లో ఉన్నాము. అతను నా కళ్ళ ముందు అక్కడికక్కడే మరణించాడు,” అని కన్నీటి పర్యంతమైంది. ఇది ఇప్పటికీ చెడు కలలా ఉందని అన్నారు.
దాడి జరిగిన వెంటను స్థానికులు తమకు సాయం చేయడానికి వచ్చారని పల్లవి చెప్పింది. తనను ముగ్గురు స్థానికులు రక్షించినట్లు చెప్పారు. దాడిలో హిందువుల్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె వెల్లడించారు. ‘‘ముగ్గురు నలుగురు వ్యక్తులు మాపై దాడి చేశారు. నా భర్తను చంపారు, నన్ను కూడా చంపేయాలని టెర్రరిస్టులతో నేను అన్నాను. వారిలో ఒకడు, నేను నిన్ను చంపను, వెళ్లి మోడీకి ఈ విషయం చెప్పండి’’ అని అన్నాడు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, X లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్‌లో దాడిని ఖండించారు. బాధితులకు కర్ణాటక ప్రభుత్వం నుంచి సాయం చేస్తామని, అండగా నిలుస్తామని అన్నారు.